🔱 శబరిమల వనయాత్ర - 18 ⚜️ కరిమల ఇరక్కం ⚜️

P Madhav Kumar


⚜️ కరిమల ఇరక్కం ⚜️


కరిమల ఉచ్చిపై తల భారముదింపి ఆకలి తీర్చుకొని అచ్చటవున్న బావి , కోనేరు , ఊట , వీటిని సందర్శించి విశ్రాంతి పొందిన పిమ్మట ఇరుముడితో సహా పంబవైపు నడిచి వెళ్ళే భక్తాదులకు కరిమల ఇరక్కము భ్రమింపజేయుచున్నది. ఏడంతస్తులతో

కూడిన మిట్ట ఎక్కినట్లే , ఏడంతస్తుల దిగుడును యుండును. ఎక్కుటకన్నా దిగుటయే కష్టసాధ్యమనుట వెనుకటి వారిమాట , గడ గడలాడించే లోయలో వృక్షములు యొక్క వేర్లు మరియు రాళ్ళను పట్టుకొని ఒక్కొక్క అడుగును అతి జాగ్రత్తగా పెడుతూ దిగవలసిన దిగుడు యనిన మిన్నగాదు. సుమారు 4.5 కి.మీ. వరకు ఈ కరిమల దిగుడు ప్రయాణము కొనసాగును.


కరిమల ఇరక్కము దిగుచుండగానే క్రింది భాగమున పొర్లి ప్రవహించే పంబానది మీదుగా వీచే చలిగాలి జిల్లున సోకి పెరియపాదలో నడిచి , వాడియి వస్తున్న భక్తాదులకు నూతనోత్సాహము ప్రసాదించి “ఇదిగో ఇంకాసేపట్లో పంబా తీరమును చేరుకోబోతున్నాము" యను తలంపును రెచ్చగొట్టి నడకను త్వరితముగావింప గోరెను. గలగలపారే ఆ నదీ శబ్దము చెవిలో ధ్వనించి వివరింపలేని ఆనందానుభూతిని కల్గింపజేయును. కొద్ది కొద్దిగా ముందుకు సాగుచుండ , పాపములను తొలగించే దక్షిణభారత గంగాయను బిరుదుతో పిలువబడు పంబానది దర్శనము లభించును."దర్శన మాత్రమునే పాపములను పారద్రోలే పంబానది" యనునది ఆ నదికి గల ప్రత్యేకఖ్యాతి. కరిమల దిగుడుకు చివర వలియాన వట్టం యను స్థలము , సిరియానవట్టము యను స్థలములను దాటిన పంబానదీతీరము చేరుకొన వచ్చును.

అయ్యప్పస్వాములు కరిమలనుండి అతి వేగముతో నడిచి పంబానదీ తీరము చేరుకొనవలెనని తొందరపడుచూ యాత్ర సాగింతురు. కరిమలను దిగునపుడు వలియాన వట్టము , సిరియాన వట్టము అను రెండు సమతల ప్రదేశములు కానవచ్చును. ఈ స్థలము నందు అయ్యప్ప స్వాములు తావళమేర్పరచి ఆహార పదార్ధములు తయారు

చేసి భుజించి విశ్రమించెదరు. ఆ స్థలము వీడినచో పిదప పంబానదీ తీరము నందే అయ్యప్ప భక్తులు తావళమేర్పర్చుకొనునది.


🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🌷🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat