సూక్ష్మత మనసు - స్థూలం శరీరం,

P Madhav Kumar

 సూక్ష్మత మనసు - స్థూలం శరీరం,

'కర్మ' బంధం వాటికి - జీవిత గమనంలో!

కాదు గదా భిన్నం - 'సూక్ష్మ శరీరం'?

కాన్ష్ స్ అండ్ యిట్స్ సబ్ కాంషెస్ నెస్....

కంటైన్ అండ్ కన్సిస్ట్ ది మెమరీ!

సహజతే యిది - సజీవ శరీరంలో!

మిగులననేది - నిర్జీవ శరీరంలో!

సూక్ష్మశరీరం అదే జన్మకారణమంటారు....!

సూక్ష్మమైనా - అదీ, శరీరమే గదా!


జీవిత గమనంలో, స్థూల శరీరంలో, మనసు సూక్ష్మత కర్మ బంధాన్ని కలిగి వుంటుంది. సూక్ష్మ శరీరమంటే మరేదో భిన్నత కలిగినది కాదు కదా! స్పృహ మరియు దాని ఉప స్పృహ జ్ఞాపకశక్తిని కలిగి ఉంటుంది. సజీవ శరీరంలో యిది సహజంగానే వుంటుంది. నిర్జీవ శరీరంలో ఇక ఏమి మిగులుతుంది?. సూక్ష్మశరీరం అదే జన్మకారణమంటారు. అది సూక్ష్మమైనా , అదీ శరీరమే కదా? అంతరిక్షాన్ని సైతం గాలిస్తున్న ఎంతో తెలివి గల జ్ఞానిని అని చెప్పుకునే మనిషి ఆలోచించాలి మరి అసలు సత్యాలను. తరతరాలుగా నదిలా ప్రవహిస్తున్న అపోహలను, మూఢనమ్మకాలను పఠాపంచలు చేస్తూ సత్య జ్ఞానాన్ని భోధించి అభ్యుదయ పథంలో నడిపిస్తున్న సత్యచైతన్యం..

*ఇంద్రియాతీత ఆధ్యాత్మికమె - ఆత్మానంద అల్టిమేషన్!*

ఆదిత్యయోగి.

"సమస్త పంచభూత ప్రకృతికి ప్రణామం 

ప్రకృతి ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం 

సర్వవ్యాపిత విశ్వశక్తి అమోఘం, అపురూపం, అనిర్వచనీయం 

నిత్య ప్రస్థాన సాధనతో, మనో ప్రస్థాన మార్గంగా విశ్వ మూలంతో మమేకం,

సర్వ వ్యాప్త విశ్వమాత దర్శితం, జీవితం పరిపూర్ణం 


అపార కరుణా ఆత్మీయ మూర్తి అభయం నిరంతర ప్రవాహం అపురూపం, విశ్వ గురువర్యుల మాధ్యమవిధానం సృష్టిలో ప్రధమం, భూలోక మానవుని అదృష్టం. అనంత వ్యాపిత ఆత్మీయ శక్తికి ప్రతినిత్యం..


'భౌతిక ఆధ్యాత్మిక సమన్వయత'


"సమాజ జీవితంలో, పౌరధర్మంగా, మనిషికి, నీతి – నియమం – నిగ్రహం – మానవత్వం, ముఖ్యంగా వుండాలి! అందుకు సమాజ కట్టుబాట్లు – ఆచారాలతోపాటు... ప్రభుత్వ చట్టాలతో సహా.... మత – ఆధ్యాత్మిక ప్రబోధాలు, దైవభావన, పాపభీతి – దైవభక్తి ఎంతో అవసరం... అందుకే, భౌతికం లేని ఆధ్యాత్మికం..., అలాగే, ఆధ్యాత్మికం, అవసరం లేని, భౌతికం.... మనిషికి మేలు చేయలేవు. జీవితానికి, ఆ రెండిటి సమన్వయతే, అతి ముఖ్యం..! అందుకు, ధ్యానం ద్వారా, భౌతిక మనసును ఆధ్యాత్మికరించి... ఆత్మీయతా స్థాయికి, దానిని చేర్చి... ‘ఆత్మ’గా స్థిరీకరించి... అదే విధానంలో, ఆత్మను, దివ్యాత్మగ... పరమాత్మకు చేర్చి, సంలీనతను పొందాలి....!


ఇది, ధ్యానప్రస్థానం – మనోప్రస్థానం యొక్క ఆధ్యాత్మిక మార్గం..! అయితే, సాకార దేవునిపై నమ్మకం – భక్తి... అలాగే నిరాకార దైవత్వం – సత్యత ఎరుక.... వీటితోపాటు, మానవత్వం – ఆత్మీయత... మానవజన్మ సార్థకతకు, ఎంతో అవసరం.... వీటన్నిటా, శరీరం – మనసు – జ్ఞానం... సన్నిహిత సంబంధాన్ని కలిగి వుంటాయనే వాస్తవాన్ని గుర్తించాలి...


_*️ #పసిడి #పలుకులు *_


_-{#మానవులు గా బతకటం కాదు.. #మానవత్వం తో బతకాలి !}-_


#ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_


_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_


_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 


_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._


_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_


_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._

ఆదిత్యనారాయణ..

_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._

ఆదిత్యనారాయణ..

_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_


_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._ 


_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_


_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_


_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._


_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_


_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_


_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._

_మౌనంగావుండేవాడు ముని._

_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._ 

_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 

_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._


_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_ 


_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._


_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._


_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_


_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_


_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 


_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._ 


_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_


_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_

_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_


_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_


_మానవులుగా బతకటం కాదు.._

_మానవత్వంతో బతకాలి !....

.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat