అమృత బిందువులు - 12 ఆలోచనా తత్వం - 4

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 4*

స్వదేశమును దూషించనేకూడదు ! అది దేశ ద్రోహం.


పండ్లతో గోళ్ళను కొరకనేకూడదు ! అది అరిష్టం.


ఉత్తుత్తి వాగ్దానాలివ్వనేకూడదు ! అది ప్రమాదకరం.


స్త్రీలు వాసనలేని పూవును పెట్టుకోనేకూడదు ! అది వ్యర్థం.


మొగిలిపూవుతో ఈశ్వరునికి అర్చనచేయనేకూడదు ! తులసితో గణపతిని అర్చించనేకూడదు !


తెల్ల పూలతో లక్ష్మీదేవికి అర్చన చేయనేకూడదు !


ఇంటి గుట్టును వెల్లడి చేయనేకూడదు ! అది స్వయంకృతాపరాదము.


ఎవ్వరితోను పరుషవచనములాడనే కూడదు ! అది తదుపుపరి ముప్పు.


పాఠశాలలో నిదుర పోనేకూడదు ! అది విద్యార్థి లక్షణం కాదు.


చెడు వార్తలను ప్రచారం చేయనేకూడదు ! అది తమోగుణ లక్షణం.


పసిపిల్లలను ఆకలితో ఉంచనేకూడదు! అది జీవహింసతో సమం.


పాలిచ్చే ఆవును కొట్టకూడదు ! అది తల్లితో సమము.


విషజంతువుల యెడ జాలిచూపనేకూడదు ! అది ప్రాణ హాని.


తెలియని వైద్య సలహా ఎవ్వరికీ ఇవ్వనేకూడదు ! అది చట్ట విరుద్ధం.


విద్యుత్ తో చెలగాటమాడనేకూడదు ! అది ప్రాణ హానికరము,


ఆభరణములను అధికముగా అలంకరించుకోనేకూడదు !


మురికి బట్టలను ధరించనేకూడదు ! అది అనారోగ్యం.


వెలిగేదీపములోని వత్తులను చేతితో తోసిపుచ్చనేకూడదు !


దీపమును నోటితో ఊది ఆర్పనే కూడదు ! అది అనాచారం.


ఎవ్వరిమీద చాడీలు చెప్పనేకూడదు ! అది పశు లక్షణం.


రాత్రిపూట భోజనంలో పెరుగు వాడనే కూడదు ! అది ఆరోగ్య హాసిని.


ఉదయం ఆరుగంటలపైన నిదురపోనేకూడదు ! అదియే అరోగ్య లక్షణం.


అశుభం జరిగిన చోట హాస్యంగా మాట్లాడనేకూడదు ! అది మర్యాద కాదు. 


ఉపకారం చేయకపోయినా ఉపద్రవం మాత్రం చేయనేకూడదు ! అది పద్దతి.


సత్పురుషుల సహవాసం మాననేకూడదు !


అనుమతిలేనిదే సరిహద్దు దాటనే కూడదు ! అది అపరాదమగును.


అడగనిదే ఎవ్వరికి సలహాలివ్వనేకూడదు ! అదియే ధర్మం.


ఎవ్వరివద్దనూ సానుభూతిని ఆశించనేకూడదు ! అది ఆత్మ హత్యకు సమం..


ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టనేకూడదు ! అది పిరికి లక్షణం. 


ఎపుడు పడితే అపుడు సముద్ర స్నానం చేయనేకూడదు ! అది అపచారం. 


వినయం లేక వ్వవహరించనేకూడదు ! అది కార్య హానియగును.


దొరికిన చోటల్లా అప్పు చేస్తూనే ఉండకూడదు ! అది ప్రాణ హానియగును.


పూర్తి విచారణ చేయక తీర్పు చెప్పనేకూడదు ! అది వృత్తి దోషమగును.


తీపిపదార్ధములు ఎక్కువ తిననేకూడదు ! అది ఆరోగ్య హానియగును.


వైద్యుని సలహా లేనిదే ఏ ఔషదం వాడనేకూడదు ! అది నేరమగును. 


అహింసాతత్మమును మరచిపోనేకూడదు ! అహింసా పరమో ధర్మః 


బాలింతలను పనిచేసితీరాలని బలవంతం చేయనేకూడదు !


విద్యుత్ను వృధాగా ఖర్చు పెట్టనేకూడదు ! అది డబ్బుకు చేటు. 


చెడిపోయిన ఆహారమును యాచకులకు ఇవ్వనేకూడదు ! అది పాపము. 


కరెన్సీ నోటును చించనేకూడదు ! అది చట్ట విరుద్దం.


అనర్హులకు అవకాశమివ్వనేకూడదు ! అది స్వయం కృతాపరాదమగును. 


దీపము పెట్టేవేళ తలుపులు మూయనేకూడదు ! అది అరిష్టం. 


పూజ చేసిన పిమ్మట గంటను నేలపై పెట్టనేకూడదు ! అది ఆచారహీనం.


దొరికింది కదాయని అమితంగా తిననేకూడదు ! అది అజీర్తి కరం. 


ఎట్టి పరిస్థితిలో నూ తలగడపై కూర్చోనేకూడదు ! అది అరిష్టం.


భార్యా భర్తల తగాదాలో మధ్యస్తానికి వెళ్ళనే కూడదు ! అది క్షేమకరం. 


దంపతుల మద్య దూరిపోనేకూడదు ! అది సంస్కార హీనమగును. 


కాళ్ళను వెనక్కి ముడుచుకొని కూర్చోనే కూడదు ! అది అరిష్టానికి దారి. 


ఎడమ చేతిని నేలపై మోపి భోజనం చేయనేకూడదు ! అది పద్దతి కాదు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat