*లౌకిక తత్వం - 2*
అనుకొన్నది సాధించు వరకు అసంతృప్తి పొందవలేదు.
అణకువ లేనివాడు దుఃఖమునొందును.
కఠిన బాషణ శత్రువులను కొని తెచ్చును.
సభామర్యాద పాటించక సంభాషించరాదు.
చెడుదారి నడచువాడు దారిలో పడిపోక తప్పదు.
పేదలు ఆహారమును , ధనికులు ఆకలిని వెదుకుచుందురు.
శత్రువు గెలిచిపోతాడని బెదిరినచో నీవు ఓడిపోతావు.
నీ కన్నా క్రింద స్థాయి వారలను చూసి నీ స్థితికి గర్వించుము.
ఎన్ని అవరోధాలున్నా పని చేసేవారే అభివృద్ధి చెందగలరు.
గతాన్ని గుర్తుంచుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలి.
నాటికి , నేటికి , ఏనాటికి సంకల్పాన్ని మించిన బలం లేదు.
చక్కగా పని చేయకుండా ఎవ్వరు ఫలితాలను పొందలేరు.
ప్రతి కార్యాన్ని తీర్చుకోవడం కాదు , దానిని భరించడం వీరత్వం.
ఆలోచనాశక్తి నిజమైన శక్తి. దానితో మహా బలవంతులం కాగలం.
మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు ఆలోచన.
చేయవలసిన కార్యం విశదమైతే విజయం దాని వెన్నంటి వస్తుంది.
ఎవరూ మిమ్మిల్ని ప్రేమించక పోతే దానికి కారణం మీరే.
ప్రపంచమును అసహ్యించుకొనవచ్చు. కాని ఆ ప్రపంచం లేక జీవించలేము
వర్తమానం సద్వినియోగం అవుతూ వుంటే భవిష్యత్తు స్వర్గమయం అవుతుంది.
ఆదుకునే హృదయం ఉన్నవారికి మాత్రమే విమర్శించే హక్కు ఉంటుంది.
ఉన్నతులకే వుంటాయి సంకల్పాలు. ఇతరులకు వుండేవి ఆకాంక్షలే.
ఆత్మవిశ్వాసం , నిరంతర పరిశ్రమ , దృఢనిశ్చయాలకు అసాధ్యమేదిలేదు.
సంపద స్నేహాన్ని పెంచుతుంది. ఆపద మనిషిని పరీక్షిస్తుంది.
కత్తి గాయం కన్న తీవ్రమైనది మాటల గాయం.
ధైర్యం ఎదుట భయంకర సంకటం కూడా మబ్బులాగా విడిపోతుంది.
వందకోట్లకు అధిపతివైనా నిమిషం ఆయుష్షు కొనలేవని తెలుసుకో.
మనం ఎవర్నయితే ప్రేమిస్తామో , వారి మంచి కోరి వారిని చివాట్లు పెడుతుంటాం.
సంశయం మానవుని మనస్సును పీడించే భయంకరమైన వ్యాధి.
డబ్బు సంపాదించాలనే ఆరాటంలో ఉన్నవారికి భగవంతుని గురించి ఆలోచించడానికి సమయం చిక్కదు.
ఆకలిగొన్నవారికి అన్నం పెట్టుటయే అసలైన అన్నదానం.
ఆవేశము అనర్థదాయకము. వివేకమే మోక్షద్వారము.
తనను గూర్చి ఆలోచించే వాడు మానవుడు. అందరిని గురించి ఆలోచించు వాడే భగవంతుడు.
గోరంత దీపం ఇంటికి వెలుగు నిస్తే , విద్య అనే దీపం విశ్వాని కంతటికి వెలుగు నివ్వగలదు.
కొండంత ధనములో సంతోషము లభించనప్పుడు జీవితానికి పనికివచ్చు చిన్న పుస్తకములో సంతోషము లభించగలదు.
క్రుంగిన జీవితాలకు ఆదరణ , అమృతమిస్తే ప్రోత్సాహము వెలుగుచూప గలదు.
ఆశలు లేని జీవితాలు ఆవిరైన నీటితో సమానము.
ఉన్నవారే గొప్పవారు అనుకోవటం పొరపాటు. ఎవరైనా ఉన్నంతలో గొప్పగా జీవించే వారే గొప్పవారు కాగలరు..
పదవిలో లభించే ఆనందము , ధనంలో లభించే ఆనందము కన్న , ఆత్మను మురిపించుకొనే ఆనందమే గొప్పది.
ఆకారమనే అందముకన్న అనురాగమనే అందము గొప్పది.
తొందరతో తీసుకొనే నిర్ణయాలు వెలితికుండలోని నీరు తొణికిన లాడునట్లుండగలవు. నిదానముతో తీసుకొనే నిర్ణయాలు నిండుకుండవలె నిబ్బరంగ వుండగలవు.
నిజమైన స్త్రీ హృదయం పచ్చని వనం లాంటిది. వనం కమ్మని పండ్లు , చల్లని నీడను , సుగంధ పరిమళాన్ని ఎలా ఇవ్వగలుగు తుందో అలాగే స్త్రీ కమ్మని మాటలను , చల్లని ఒడిని ఇవ్వగలదు.