*లౌకిక తత్వం - 4*
మంచివాడుగానే వుండుము - మంచినే
చేయుము - మంచినే చూడుము. అదియే అసలైన సంతృప్తి.
పిరికితనము , ద్వేషము , భయము పొదిగియున్న హృదయములో భగవంతుడు కనపడడు.
ఏ కృషిచేయకుండా సంపదలు వాంఛించేవాడు మూర్ఖుడు.
పరాధీనమైనదంతా దుఃఖం - స్వాధీనమైనదంతా సుఖం.
*విద్యను దాచుకోకుండా పదిమందికి పంచిపెడితే అది మరింత రాణిస్తుంది.*
దూరపు కొండలు నునుపు దగ్గర బంధువు మహాచేదు.
దిక్కులేనివాడికి దేవుడే దిక్కు.
మూర్ఖునికి హృదయము నోటిలో ఉంటుంది.
ద్వేషశక్తి కంటే ప్రేమశక్తి కోటిరెట్లు ఘనతరము.
ఆవేశముతో అడుగు వేయకు. కష్టాలను కొని తెచ్చుకోకు.
తల్లిని దూషించడము భార్యను ప్రశంసించడము అల్పుల అవివేకము ,
కుటిలపరుల మాటలు అమృతము కన్నా అపురూపముగా ఉండగలవు.
కుటిలపరులు మాటలతో పనులు జరిపించుకోగలరు. పనులు అయిన తరువాత అవిటి వారిని చూచినట్లు చూడగలరు.
విధి ఆడించే ఆటకు హద్దే లేదు. విధి కాటుకు మందే లేదు.
కృషికి తోడు అదృష్టం కలిసి వస్తే అనుకున్నవన్నీ జరుగుతాయి.
ఎంత కృషి చేసినా పని జరుగలేదని చింతపడకు. చింత ఎక్కువ అయితే మనస్సు అశాంతికి గురవుతుంది.
అశాంతి పెరిగితే దుఃఖం మొదలవు తుంది.
చల్లని గాలి వలన మనస్సు తేలిక అయినట్లు , మంచి వారి స్నేహము వలన కూడా మనస్సు తేలిక కాగలదు.
జరగని దాని కోసము ఆరాటపడకు. జరిగే దాని కోసము పోరాడు. ధర్మానికి గొప్ప రహదారే దాన గుణము.
దినచర్య విద్యార్థి అభివృద్ధికి వెలుగు కిరణం.
ఇల్లు అనే నౌకకు తెరచాప లాంటిది ఇల్లాలు.
చెప్పుడు మాటలు చెవులకు ఇంపు. తుదకు జీవితాలకే కంపు కాగలవు.
అర్ధం లేని ఆలోచనలను వదిలిపెట్టు. అలాంటి ఆలోచన మొదలు పెట్టావంటే జీవితమే నిస్సారము కాగలదు.
అన్నింటిని కోల్పోయినానని ఆవేదన చెందకు. నిన్ను కాపాడుతూ , రక్షించుతూ నీలోనే గొప్ప ఆయుధం దాగి వుంది. అదే నీ వద్ద వున్న దైర్యలక్ష్మి , దాన్ని నీవు కోల్పోయి నప్పుడు అన్నింటిని కోల్పోయినట్లు కాగలవు.
పొగిడినంతనే పొంగిపోకు. అందులో మర్మమేమిటో తెలుసుకో , ధర్మమనిపిస్తే సహాయము చెయ్యి , అధర్మమనిపిస్తే వదిలి వెయ్యి ఆలోచించక ఏమిచేయకు.
తనను తాను ఎరింగినవాడు తన మార్గమును చక్కగా ఎన్నుకోగలడు. తలచుకొంటే వల్లకానిదంటూ ఏమియు లేదు. సాధన వలన సర్వము సమకూరును.
మదము ఎంత నీచస్థాయికైనా దిగజార్చి , మలినం చేయగలదు. మంచిని కూల్చ గలదు.
నియమబద్ధ జీవితానికి కోర్కెలను జయించటం మొదటిమెట్టు అవుతుంది.
నేరాలు చేయడం దీర్ఘకాల వ్యాధిలాంటిది. వాటికి ఓర్పుతో , నేర్పుతో దీర్ఘకాలిక చికిత్స చేయాలి.
లేని గొప్పదనం వుందని చెబితే ఉన్న గొప్పదనం కాస్తా వూడిపోతుంది.
మంచి పుస్తకాలు మన చెంత వుంటే మంచి మిత్రుడు దగ్గరలేని లోపం తీరుతుంది.
విధి నిర్వహణకు మించిన మంచి పని లేదు.
ప్రతి శక్తి వంతుడికి ఒక బలహీనత వుంటుంది.
ఏళ్ళు గడిచినంతమాత్రాన వయస్సు పైబడినట్లు కాదు. వయస్సు అనేది మనస్సు ఆరోగ్యానికి సంబంధించినది అగును.
మంచి ఆహారం , మంచి హృదయం ఇవి ఉన్నవాడు ఎప్పుడూ సంపూర్ణ ఆరోగ్యవంత
తక్కువ తెలిసినవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఎక్కువ తెలిసినవాళ్ళు తక్కువ మాట్లాడతారు.
పురోభి వృద్ది గోరు వారు పూర్వవృత్తాంతమును మరువరాదు.
లేని మహిమలు చెప్పుకొన్న, ఉన్నమహిమలు సున్న అగును.
సోమరితనము చెడునకు పుట్టిల్లు. కాలము అమూల్యము. పోయిన కాలము తిరిగిరాదు.
నవ్వినచో ప్రపంచమంతయు నీతోబాటు నవ్వును. ఏడ్చినచో నీ ఒక్కడివే ఏడ్వవలసి ఉంటుంది.
వ్యర్ధ తర్కము అజ్ఞానమునకు చిహ్నము.
స్త్రీలకు నగలకంటే పరమోత్తమమైన ఆభరణము భక్తి.