అమృత బిందువులు - 20 జీవన తత్వం - 1

P Madhav Kumar


*జీవన తత్వం - 1*

కొద్ది స్నేహము చూపువాడు స్నేహితుడు


చిరకాలము స్నేహము చేసేవాడు మిత్రుడు 


సోమరిగా , అజ్ఞానిగా నూరేళ్ళు బ్రతకడం కన్నా , కార్యశీలిగా , జ్ఞానిగా ఒక్కరోజు బ్రతకడం మేలు.


హృదయం అంతా ఆనందమయమైతే లోకమంతా అందంగా కనిపిస్తుంది. 


వాక్కు , మనసు , శరీరం శుచిగా తీర్చి దిద్దుకోవాలి.


అహంకారం లేకుండా సచ్చీలుడై , శాంత బుద్దియై ఫలాపేక్షలేని భావంతో మెలగాలి. సర్వదా భూతదయ కల్గి ఉండాలి. అపుడే జ్ఞానం అబ్బుతుంది. 


కళ్ళు వెళ్ళిన చోటికెల్లా మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన చోటికెల్లా మనిషి వెళ్ళకూడదు.


బద్దకం , ఆలస్యం , నిద్ర , మందబుద్ధి కలవారు ఆధ్యాత్మిక జీవితానికి పనికిరారు.


ఒకరి నుండి దేనినైనా ఆశించుటకంటే ఒకరికి ఇచ్చుట శ్రేష్ఠమైనది.


పాము పడగపై మణి ఉంటే అందం. మనిషి వ్యక్తిత్వం బాగుంటే గౌరవం. 


నీకోసం , నీ మనసుకోసం ధర్మాన్ని ఆచరించు. ఒకరి మెప్పుకోసం ఆశించవద్దు. 


కంచె లేని పొలానికి రక్షణ లేనట్లే , శిక్షణ లేని జీవితానికి కూడా రక్షణ ఉండదు.


అర్థంలేని ఆలోచనలను వదిలిపెట్టు.  లేనిచో జీవితమే నిస్సారము కాగలదు. 


అవసరమైనప్పుడు మేథస్సును చూపించి. అవసరం లేనప్పుడు మేథస్సును నియంత్రణలో ఉంచుకో గలవాడే మేధావి.


భర్త లేని కుటుంబము శిథిలమైన గృహం లాంటిది.


రూపములో , వేషములో మంచి కనిపించదు. హృదయంలో మలినం మాయమైన వారిలోనే మంచి కనిపించును.


చెదలుకు చెడుపు చేయడం తెలుసు. మంచి చేయడం తెలియదు. చెడుదారి కూడా చెదలు లాంటిదే.


దేవుడిచ్చిన దేహాన్ని సుఖపెట్టబోకు. ఏదో ఒక వ్యాపకాన్ని (పనిని) కల్పించుకో , ఆందోళనలు కన్పించవు. అనారోగ్యాలు చుట్టుముట్టవు. 


అన్నింటిని కోల్పోయినానని ఆవేదన చెందకు. నీలోనే నిన్ను కాపాడుతూ , రక్షించుతూ గొప్ప ఆయుధం దాగి వుంది అదే ధైర్యము. అది కోల్పోయినప్పుడు అన్నింటిని కోల్పోయినట్లు కాగలదు.


జీవితము జరిగే కొలది కాలము జరుగుతుంది. జీవితము బరువు అయితే కాలము మరుపు అవుతుంది.


కష్టాలకు భయపడి పిరికి పందగా పారిపోకు. ముందుకు వెళ్ళి పోరాదు. కష్టాలే వెనుకకు తగ్గిపోగలవు.


మానవుల ప్రేమను పొందలేమని , అభాగ్యులమని బాధ పడకండి. భక్తిచూపి భగవంతుని ప్రేమను పొందండి. దానికి మించినది ఏది ఈ విశ్వంలో లేదు.


భ్రమపడి అమృతమును పాషాణముగా ఊహించుకోకు. పాషాణము అమృతముగా మార్చుకొని ఊహించుకో. హృదయం ఉప్పొంగి పోగలదు.


గుణవంతునికి నీతియే కోట్ల ఆస్తి.


ఆస్తి లేదని చింతించకు. నిశ్చలమైన నీ హృదయమే వెలకట్టలేని ఆస్తి.


అన్ని కోణాలలో ఆలోచించి , అడుగు వేయడమే అసలైన జీవితము.


నిస్వార్థ జీవికి నియమాలు అవసరం లేదు. నిస్వార్థమే ఒక గొప్ప వెలుగు లాంటిది.


మనస్సులో విషపు ఆలోచనలనే బీజాణువులు మొలకెత్తితే జీవితము అంధకారము కాగలదు.


అదుపు తప్పిన జీవితాలకు గొప్ప ఆశయాలు వుండవు. మూర్ఖులు అంతులేని అవివేకముతో ఎనలేని ఆవేశముతో కాలము గడుపు చుందురు.


అహంకారాన్ని అభివ్యక్తం చేయకుండా బాధ్యతలను నమ్రతగా నిర్వర్తించాలి. 


సంకల్ప బలంతో ముందడుగు వేస్తే విజయం మీదే.


వివేకం , సంతృప్తి , శాశ్వత సుఖశాంతులకు దోహదం చేస్తాయి.


సమయ సద్వినియోగం సాఫల్యానికి రాచబాట. 


ఎదుటి వారి సంతోషంలో మన సంతోషం వెతుక్కోవాలి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat