అమృత బిందువులు - 21 జీవన తత్వం - 2

P Madhav Kumar


*జీవన తత్వం - 2*

మన దాకా రానంతవరకు అన్నీ సరదాగానే వుంటాయి.


బద్దకాన్ని అప్పుడప్పుడు ఓర్పుగా పొరబడతారు.


ఆరంభంలోనే అంతం వుంది.


మనం ఎన్నుకొనే మార్గం మన గమ్యానికి అనుగుణంగా వుండాలి.


నమ్మకూడనివి వదంతులు.


ఈర్శ్య చాలా చెడ్డగుణం.


ఆపదను కొనితెచ్చేది కోపము. దురాశ.


తనకు తానే వచ్చునది యవ్వనం , వార్ధక్యం


చేసే వృత్తిని విడిచినవాడు చెడును. తెలియని పనిని తాకినవాడు చెడును.


ఇతరుల నేరాలను కనిపెట్టి విమర్శించుట మానుకో.


దీర్ఘాలోచన జీవితమున విజయమును తెచ్చిపెట్టును.


ధైర్యము ఎనలేని శత్రువులను హతమార్చును.


ప్రేమ తనకు తానే కలగాలి. దాన్ని డబ్బిచ్చి కొనలేము.


దుఃఖము రాబోతుందన్న భయమే మిక్కిలి దుఃఖమైనది.


మంచి విషయాల్లాగానే , చెడు విషయాలు కూడా మనకు అనేక పాఠాలు నేర్పుతాయి.


సానుభూతికి మించిన ప్రేమ లేదు. ప్రేమకు మించిన ఆయుధం లేదు.


తప్పని ఒప్పుకొనుట ఓటమి కాదు. ఆ ఒప్పుదలయే విజయవంతమగును.


తమ తప్పులను కప్పి పుచ్చుకొనేవారు ఇతరుల బలహీనతలను వెతుకుతారు.


ధైర్యవంతుడు ఆపదలు కలిగినప్పుడు హృదయ దౌర్బల్యానికి లోను కాడు.


ఏం సాధించినా , కోల్పోయినా మనపై మనకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోకూడదు.


ఒక లక్ష్యాన్ని కలిగి యుండుటే జీవితంలో అన్నిటి కంటే ముఖ్యమైనది.


ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది.


అపారంగా ఇవ్వడం కాక అవసరం కనిపెట్టి ఇవ్వడం ఔదార్యం.


నీ దోషాన్ని చూపే వ్యక్తిపై కోపగించకు , దానికి కారణం తెలుసుకో.


ఆశావాది ప్రతి కష్టంలో అవకాశాన్ని చూస్తాడు. నిరాశావాది ప్రతి అవకాశం లోను కష్టాలనే చూస్తాడు. 


ఇతరుల కోసం పనిచేయడం మన శక్తికి గుర్తు. ఇతరుల కోసం బాధపడడం మన ప్రేమకు గుర్తు.


అందరిలో మర్యాదగా ప్రవర్తించాలి గాని , కొందరితో మాత్రమే సన్నిహితంగా వుండాలి


ఇతరుల లోపాల వల్ల జరిగిన హానిని చూసి తన లోపాలను సవరించుకొనే వాడు విజ్ఞుడు.


విశాల హృదయులు సత్యసారాన్ని గ్రహిస్తారు. లఘు మనస్కులు తేడాలను వెదుకుతారు.


ఇంట్లో ఒద్దిక భూతల స్వర్గంతో సమానం.


పరుల హితం కోసం తన సుఖాన్ని త్యాగం చేయడం నిజమైన సేవ.


పరులను పడగొట్టే ప్రయత్నంలో నువ్వే పడిపోగలవు.


ప్రేమ అన్నది పరులనుసైతం తనవైపుకి ఆకర్షించే అయస్కాంతం.


కోటి కోట్లకు వారసుడివైనా ఊపిరిపోగానే ఊరిబయట పారవేస్తారని తెలుసుకో.


భర్తకు సేవచేసి , ఆయన పట్ల విధేయతను కలిగి ఉండడం భార్యవిధి.


దయ , ప్రేమానురాగాలు , పరోపకారం గల గృహమే లక్ష్మీ నిలయం.


సంయమనమే సమస్యకు సాధనోపాయం.


సంయమనమే సర్వదా శ్రేయస్కరము.


ప్రకృతి కృతకమూ బంధమూ ! పురుషుడు హితకరమూ మోక్షమూ ! 


మమకారమే మాయ. ఓంకారమే సత్యము.


ధర్మ మార్గం ఇరుకైనా ప్రయాణించు. అధర్మమార్గము ఎంత విస్తీర్ణమైన ప్రయాణించకు.


జరుగబోయే దానిలో మంచి వుంటే స్మరించుకో. చెడు వుంటే విస్మరించుకో.


కలిసిరాని జీవితాలకు లేములు స్నేహితులైతే కలిమిలు శత్రువులు కాగలవు.


చెప్పడము ఎంత తేలికో , ముడివేయడము కూడా తేలికే. ముడి విప్పడము ఎంతకష్టమో ఆచరించడము కూడా అంత కష్టమే.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat