శ్రీ #మానసాదేవి ఆలయం - కరీంనగర్ జిల్లా : #ఖసింపేట

P Madhav Kumar


💠 కరీంనగర్ పట్టణం నుండి 30 కిలోమీటర్ల దూరంలో గన్నేరువరం మండలం ఖసింపేట గ్రామ శివారు ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన "మానసా దేవి" ఆలయం ఉంది.


💠 ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట. 

పృధ్వి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట. 

అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమే మానసాదేవి .


💠 మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు.

కేవలం సర్పాలకే కాదు... సంతానానికీ, సంపదకు కూడా మానసాదేవి అధిపతే .


💠 క్షీరసాగరమథనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు, ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు. 


💠 "మానస దేవి" అనగా ప్రియ భక్తుల కోర్కెలు నెరవేర్చిన దేవత అని అర్థం. 

ఈ దేవాలయం పరిసరంలో గల ధ్వజస్తంభంకి  ముడుపులు కట్టి తమ కోర్కెలను నెరవేర్చమని భక్తులు ప్రార్థిస్తారు.


💠 శివాలయంలో స్వయంభూగా అమ్మ వారితో పాటు అపురూప మహాలక్ష్మి అమ్మవారు వెలిశారు.

వినాయకుడు,శ్రీ సీతా రామచంద్రస్వామి, మహాదేవుడు , ఆంజనేయ స్వామి వారు ఉన్నారు.


💠దే వాలయంలో ధర్మ గుండం 108 శివలింగాలు మరియు జంట సర్ప విగ్రహాలు ఉన్నాయి మధ్యలో పరమేశ్వరుడు ఉంటాడు.

భక్తులు ధర్మ గుండం108 శివలింగాలు మరియు జంట సర్ప విగ్రహాలకు అభిషేకం చేస్తారు.


💠 అమ్మవారు ఇక్కడ స్వయంబు... వెలిసిన అమ్మవారు .

 సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వారు , ఇంకా ఏదయినా సమస్యలు ఉన్నా వాళ్ళు దర్శనం చేసుకుంటే కచ్చితంగా జరుగుతుంది అని ప్రచారం.

 ఈ మధ్య చాలా మంది భక్తులు  కుటుంబ సమేతంగా వచ్చి దర్శనము చేసుకుంటున్నారు . 

 


💠 మానసా దేవి గుడి వెళ్ళాలి అంటే కరీంనగర్ నుండి వచ్చే వారు వెంకట్రావు పల్లె నుండి లెఫ్ట్ కు మలిగి ,మల్లాపూర్, పోత్తుర్, చొక్కారవుపల్లె,గన్నేరువరం, కాశింపేట మానసా దేవి గుడి... సిరిసిల్ల నుండి వెల్లే వారు తంగళ్లపెళ్లి, లక్మిపూర్, వెలిజిపూర్,రహీంఖాన్ పేట, ముస్కాన్ పేట గాలిపెల్లి, కాశింపేట మానసా దేవి గుడి..

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat