అమృత బిందువులు - 23 జీవన తత్వం - 4

P Madhav Kumar


*జీవన తత్వం - 4*

తన్నుతాను పొగడుకొనడం అంతమైనచోట , హుందాతనం ప్రారంభమవుతుంది.


నీచత్వము , స్వార్థపరత్వము - ఈ రెండు క్షమించలేని పాపాలగును.


ప్రేమలేని శరీరం శ్మశానములో శవముతో సమానము.


అపకీర్తిని నెత్తిమీద వేసుకొని జీవించడంకంటే ఖ్యాతితో మరణించడం మేలు. 


శీలమే జీవునికి అలంకారము. శీలం లేని మనిషి జీవచ్ఛవం.


శాంతిలేని వారికి సుఖమెక్కడ.


మిత్రులు లేనివారికి సుఖమెట్లు లభించును.


అత్యాశ వినాశనమునకు హేతువు.


ఆలస్యమైన అమృతం గూడా విషమగును. 


మనుష్యుడు డబ్బుకు దాసుడు.


ఏ పనైనా అతిగా చేయకూడదు.


శ్రద్ధ గలవానికి విద్య లభించును.


మీ ఆదర్శము ఇతరులకు మార్గదర్శకం అయినప్పుడే మహోన్నత వ్యక్తులుగా కీర్తింపబడగలరు.


అతి సంపాదన హానికరం. మనస్సును మలినము చేసి జీవితాలను అంతము చేయగలదు.


దూషించడము దుర్మార్గుల లక్షణము ఐతే మన్నించడము మంచి వారి కర్తవ్యము కాగలదు.


ముందుచూపు లేని జీవితము, మునిగిపోయిన నౌకతో సమానము.


మహోన్నత మార్గములో నడిచే వారికి మొదట ముండ్లబాట అగుపించ గలదు. కాలక్రమేణ ముండ్లబాటయే రాచబాటగా మారగలదు.


నిన్ను నీవు కించపరచుకోకు. లేదని బాధపడకు. ఆడంబరులతో పోల్చుకోకు.


నీ స్థానములోనే నీవు సంతృప్తి చెందు. ఎటువంటి అసంతృప్తి అగుపడదు.


నోట మాట యున్నంతవరకే ఆ మాటకు నీవు యజమాని. మాట కోట దాటితే ఆ మాటలే నీకు యజమాని అవుతుంది.


హాస్యములేని సంభాషణ వలదు. అది ఇతరులను పరిహసించే సంభాషణ గాను. ఉండదు. అలా యుండినచో అది నీకే ఎపుడో ఒకప్పుడు హానికరమౌతుంది.


సమయం ఎంతో విలువైనది. సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి.


సమయం విలువ తెలుసుకోలేనివారు సమస్యల వలయాలలో చిక్కుకొని బాధ పడడమే కాకుండా , విలువలను కూడా పోగొట్టుకోగలరు.


భక్తితత్వాలు భక్తుల హృదయాలకు వికాసాన్ని కలిగించడమే కాకుండా నిర్ణయాన్ని ప్రసాదించగలవు.


మమతలు లేని గృహములో మంచి ఉండదు. మానవత్వము అసలే ఉండదు.


సమయపాలన జీవితాల అభివృద్ధికి సోపానం లాంటిది. 


సంతృప్తి నొసంగని ధనం , సౌఖ్యం ఎంత ఉన్నా అవి శవాన్ని అలంకరించిన పుష్పం వంటిది అగును.


తొందరపాటు గొడ్డలి లాంటిది. గొడ్డలితో వృక్షాన్ని కూల్చినట్లు కొందరు తొందర పాటు తనముతో జీవితాలనే కూల్చుకోగలరు.


నియంత్రణ లేని జీవితము యంత్రం లాంటిది.


కుటుంబమనే రథానికి భార్య , భర్తలు రెండు చక్రాలైనప్పుడే , కుటుంబ రథము నిలబడగలదు. గలదు. ఏ ఒక చక్రము లేక పోయినా , చిన్నదైనా కూలబడ గలదు.


జరగని ఆశలకు ఎదురు చూడకు. దుఃఖాన్ని వరించకు.


మనస్సులోని మలినాలను తుడిచివేసి , మహనీయులుగా , ధైర్యశాలులుగా మారేటట్లు చేసేది మంచి పుస్తకం.


ఆత్మలో నుండి వచ్చిన ఆనందానికి మించినది ఈ విశ్వములో ఏదియు లేదు.


చెడుతో సహవాసం బ్రతుకుకు వన వాసము.


ఓపిక పొందుటకు సహనము అవసరము. సహనము మూలాన ఆత్మస్థైర్యమును పొందవచ్చును.


ఇతరుల నేరములెంచక , తన తప్పు తెలిసి , సరిదిద్దుకొనుటకు ప్రయత్నించ వారికి భగవంతుని అనుగ్రహం సిద్ధించును.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat