చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం

P Madhav Kumar

 ప|| చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడగించు సంకీర్తనం ||


చ|| సంతోష కరమైన సంకీర్తనం  సంతాప మణగించు సంకీర్తనం 

జంతువుల రక్షించు సంకీర్తనం సంతతము దలచుడీ సంకీర్తనం ||


చ|| సామజము గాంచినది సంకీర్తనం  సామమున కెక్కుడీ సంకీర్తనం సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం ||


చ|| జముబారి విడిపించు సంకీర్తనం  సమ బుద్ధి వొడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదుల జేయు సంకీర్తనం ||


చ|| జలజాసనుని నోరి సంకీర్తనం చలిగొండ సుతదలచు సంకీర్తనం చలువ గడు నాలుకకు సంకీర్తనం  చలపట్టి తలచుడీ సంకీర్తనం ||


చ|| సరవి సంపదలిచ్చు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం 

సరుస వేంకట విభుని సంకీర్తనం  సరుగనను దలచుడీ సంకీర్తనం ||🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat