Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

P Madhav Kumar

 శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


పొడుస్తూ భానుడూ 

పొన్న పువ్వు ఛాయ

పొన్నపువ్వు మీద 

పొగడపువ్వు ఛాయ 


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


ఉదయిస్తూ భానుడు 

ఉల్లిపువ్వు ఛాయ

ఉల్లిపువ్వుమీద 

ఉగ్రంపు పొడిఛాయ 


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


గడియెక్కి భానుడు 

కంబపువ్వు ఛాయ

కంబపువ్వు మీద కాకారీ పూఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


జామెక్కి భానుడు 

జాజిపువ్వు ఛాయ

జాజిపువ్వుమీద 

సంపంగీ పూఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


మధ్యాహ్న భానుడు 

మల్లెపువ్వు ఛాయ

మల్లెపువ్వుమీద 

మంకెన్న పూఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ

ములగపువ్వుమీద 

ముత్యంపు పొడిఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


అస్తమాన భానుడు 

ఆవపువ్వు ఛాయ

ఆవపువ్వుమీద 

అద్దంపు పొడిఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


వాలుతూ భానుడు 

వంగపువ్వు ఛాయ

వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ 


గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ

గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Type text to search
📢 Follow