⚜️ పంబావిళక్కు ⚜️
పంబాసద్ది ముగిసినచో పంబాదీపోత్సవమున కొరకు సన్నద్దులౌతారు. అడవి నుండి తెచ్చిన వెదరుకొమ్మలను నూలు దారముతో కట్టి ఒక చిన్న సప్రములా తయారు చేయుదురు. పిదప అందున బెలూనులు కట్టి కొవ్వొతులను వెలిగించి సాయం సంధ్యా సమయాన పూజాభజనలు చేయుచునే బృందముగా వాటిని మోసుకొచ్చి పంబానది ప్రవాహమునందు విడిచిపెట్టెదరు. ఒక్కొక్క బృందములోని వారి హస్తకళా నైపుణ్యముతో తయారై పలువేల దీపకాంతులతో నిండిన ఈ చిన్ని చిన్ని సప్రములు ఒకదాని వెంట ఒకటిగా తేలుతూ వచ్చేదృశ్యము చూసి ఆనందింపదగిన విషయ మగును. దీనినే పంబావిళక్కు అని అందురు. ఇది శబరిగిరి యాత్ర వెడలే ప్రతియొక్క బృందమువారు అనుష్ఠింపవలసిన ఆచారమగును.
🙏🪷 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏