అమృత బిందువులు - 3 గురు తత్వం - 1

P Madhav Kumar


*గురు తత్వం - 1*

*నగు రధికం విద్య నగురో రధికం తపః తస్మాత్ గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |*

*- అన్నారు పెద్దలు*


*దేవతలందరూ ఒక గురువు వద్ద శిష్యరికం అనుష్టించినవారే. వారందరికీ ఒక్కొక్క గురువులుంటారు. దేవతలు సైతం గురుసేవ చేసి ప్రఖ్యాతి నొందినవారే.*


*దేవతల గురువు బృహస్పతి. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. శ్రీకృష్ణుని గురువు సాందీపమహర్షి. దశరథ గురువు వశిష్ఠుడు. శ్రీరాముని గురువు విశ్వామిత్రుడు. కురుపాండవులు గురువు ద్రోణాచార్యులు. హనుమంతుని గురువు సూర్యుడు. అర్జునునకు కృష్ణుడు గురువు. కచునికి బృహస్పతి గురువు. కుశలవులకు వాల్మీకి గురువు. వాల్మీకి (రత్నాకరునికి) సప్తరుషులు గురువులు. సనత్కుమారుల గురువు శ్రీ దక్షిణామూర్తి, మహాత్మాగాంధికి హరిశ్చంద్రుడు గురువు. దత్తుడు కాకివద్ద ఐకమత్యమును , శునకము వద్ద విశ్వాసమును నేర్చుకొన్నట్లుగాను అలా 64 జీవరాశుల వద్ద నుండి మంచిని అభ్యసించినట్లుగాను అవన్నియు నాకు గురువులేనని అభివర్ణించి యున్నారు.*


*మనవద్ద లేని సద్విషయమును ఎవరి వద్ద ఉండినను వారలను గురువులుగా స్వీకరించవలయును. ఇందులో వయోబేధముగాని , లింగబేధము గాని ఉండవు. పసితనంలోనే జ్ఞానం బడిసిన తిరుజ్ఞాన సంబందర్ అను పసిబాలుని వద్ద వయోవృద్ధుడైన తిరునావుకరుసు శిష్యరికం చేసి జ్ఞానపాఠం చేసినట్లు శివపురాణములో చెప్పబడి వున్నది.*


*గురుద్రోహమునకు పరిహారము ఏ శాస్త్రము చెప్పబడలేదు. గురుద్రోహి లోను క్షమించుట యనునది బుసకొట్టే నల్లత్రాచు వద్ద జీవకారణ్యము చూపినట్లే అని మనునీతి శాస్త్రము నందు చెప్పబడినది.*


*కండకు గోరుకు గల బంధము వంటిదే గురుశిష్య సంబంధము. కండకన్న గోరు పెరిగినపుడెల్ల కత్తరించి వేయునట్లు , శిష్యుడు గురువు వద్ద తోక విసిరినప్పుడెల్లా తన వద్దనున్న అతీత శక్తితో ఆ తోకను నరికి పారేస్తుంటాడు గురువు.*


*రాముని బాటను అనుసరించాలి. కృష్ణుని మాటను ఆచరించాలి. ఇవి రెండూ తారుమారైతే జీవితం అపహాస్యపాలగును.*


*ప్రత్యక్ష దైవాలగు తలిదండ్రుల గొప్పదనాన్ని చాటిచెప్పేవాడు గురువు. అందుకే గురువులేని విద్య గ్రుడ్డివిద్య అని అన్నారు. ఏలనగా గురువు చెప్పకుండినచో తల్లిదండ్రుల గొప్పదనము మనకు ఎలా తెలుసు.*


*ఆచార్య సేవకన్న దైవారాధన మిన్నకాదు. ఆచార్య సేవలో నున్నవారిని దైవమెన్నడూ పరిశోధించి చూడడు.*


*గురుదక్షిణ అడిగి చిన్నబోయాడు ద్రోణుడు. ఆయన అడిగిన గురుదక్షణనిచ్చి నేటికీ శిష్స్యులకు ఉదాహరణగా నిలచియున్నాడు ఏకలవ్యుడు.*


*చెట్టులోను పుట్టలోను కనిపించేవాటిని గురువుగా (నన్నుగా) దలచి మ్రొక్క మన్నాడు స్వామి.*


*అందరిలోను ఒక ఆదర్శ గురువున్నాడు. ఆయనను ముందుంచి , ఆ ఆదేశానుసారం కార్యనిర్వహణ గావించినచో విజయం తథ్యం.*

*ఒక్కొక్క సత్ గ్రంథము ఒక్కొక్క సత్ గురువు. అందుండి మనకు కావలసినవి మాత్రం హంసక్షీరోదక న్యాయమున స్వీకరించి తక్కిన వాటిని వదలిపెట్టుట మంచిది.*

*గురువు కన్నా విద్యయే తపము లేదు అన్నది శాస్త్రము. కావుననే గురువు త్రిమూర్తులకు సమమైనవాడు అందురు. దేవతలందరూ కూడా తమలను గురువులు గానే చూపించుకొనుటకు ఇష్టపడుతారు.*

*ఉదా॥ వసుదేవ సుతందేవం కంస చాణూరమర్దనం , దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం , గురువే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిదయే సర్వవిజ్ఞానాం శ్రీ దక్షిణామూర్తినే నమః. తల్లికిమించిన దైవం లేదు తండ్రికి మించిన గురువులేదు.*

*తండ్రికి ప్రణవార్ధమును ఉపదేశించినవాడు కనుక కుమారస్వామిని పరమగురువు అని అందురు.*

*గురుపుత్రుని శాపమును దీర్చి , గురువుగారి పుత్రశోకమును పోగొట్టినవాడు కనుక అయ్యప్పను "గురివిన్ గురువు" అందురు.*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat