🔱 శబరిమల వనయాత్ర - 31 ⚜️ నీలిమల ఏట్రమ్ ⚜️

P Madhav Kumar


⚜️ నీలిమల ఏట్రమ్ ⚜️


అలుదామేడు ఎక్కుట , కరిమల ఎక్కుట వీటితో సరితూగగల కష్టమైన కార్యము ఈ నీలిమల ఎక్కుట , రెండు మాసముల నుండి వ్రతము గైకొని , ఈశ్వరుని భజించుకొనుచూ , పలు విధములైన క్లేశములను సహించి వచ్చుచున్న స్వాములు స్వామిని (శరణమయ్యప్ప అని) సదా ఉచ్చైస్వరముతో పిలుచుచూ , నడచుచూ , ఎక్కుటలో అలసిపోవుచున్ననూ ఆ కష్టమునకు చింతించరు. నీలిమల ఎక్కు దారి

మధ్యలో అనేకమంది అయ్యప్ప స్వాములు పలు స్థలములందు విశ్రమించుచూ తమతో తెచ్చుకొనెడి పంబా తీర్థమును కొద్ది కొద్దిగా సేవించుచూ నీలిగిరిని దాటుదురు. సామాన్యముగా ఎవరునూ ఈ దారిలో తావళ మేర్పరచుకొని కాలమును వృథా చేయరు. మరికొన్ని క్షణములు గడిచినచో , కొద్దిసేపు నడచినచో స్వామి అయ్యప్పను చూడబోవుచున్నామన్న ఆనందముతో నిట్టూర్చక నడుచుచుందురు.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప💐🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat