అమృత బిందువులు - 8 అయ్యప్ప తత్వం - 4

P Madhav Kumar


*అయ్యప్ప తత్వం - 4


*"స్వామియే శరణం అయ్యప్ప" అనే భగవన్నామమును స్మరిస్తూనే యుండవలెను.*


తనకు ఆర్థికంగా ఎంత శక్తిగలదో అందుకు తగినట్లుగానే భగవంతుని అర్చించవలెను.


ఏదైన ఆహారమునకు సంబంధించిన దానిని భగవంతుని స్మరించి తరువాత తినడంగాని , భగవంతునకు సమర్పించి ఆ తరువాత తినడం గాని చేయవలెను.


భగవంతునికి ఇష్టమైన కార్యాలను చేయునపుడు భయపడకూడదు.


భగవంతునకు సంబంధించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలలో విధిగా పాల్గొనవలెను.


ఏ మంచి పనులు ఏవి చేస్తున్నా, భగవంతుని తలుస్తూనే చేయవలెను.


భోజనమునకు ముందు. భోజనానంతరము  కాళ్లు , చేతులు కడుగుకొనవలెను.


హితమైన "సాత్త్విక ఆహారాన్ని" మితంగా భుజించవలెను.


అయ్యప్ప దీక్ష ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలెను.


మనకు ఇష్టమైన పనినైనా పరిత్యజించి , స్వామి యొక్క సేవలో పాల్గొనుటకు సంసిద్ధుడగు చుండవలెను.


దీక్షకు అవసరమైనంత వరకే భౌతిక జగత్తు నుండి స్వీకరించవలెను.


మర్రి మారేడు మొదలగు వృక్షములకు నమస్కరించవలెను.


అవసరమైనంత వరకే నిత్య జీవన కార్యక్రమాలను ఆచరించవలెను.


దుఃఖము కలిగినపుడు క్రుంగిపోవుట గాని , సుఖము కలిగినపుడు పొంగిపోవుట గాని చేయకూడదు.


వివిధ హోమ , యజ్ఞముల ద్వారా వ్యాపించిన పొగను శ్రద్ధతో పీల్చవలెను.


పురాణ కాలక్షేపాలలో పాల్గొనవలెను.


భగవానుని అనుగ్రహము కొరకు సదా ప్రార్థించవలెను.


భక్తి భావము కలిగి యుండి భక్తి గ్రంథాలను చదువుచుండవలెను.


ఇష్టముతో దేవునికి సేవ చేయవలెను.


దేవుని కీర్తించునపుడు , నామములు ఉచ్ఛరించునపుడు తప్పులు రాకుండా జాగ్రత్త పడవలెను.


స్వామికి సంబంధించిన వివిధ శ్లోకాల , నామముల యందు అర్థాలను తెలుసుకోవలెను.


తన కంటే పరిణితి పొందిన భక్తులతో సాంగత్యము చేయవలెను. 


భక్తి లేనివాని సాంగత్యమును , పరుషముగా మాట్లాడువాని సాంగత్యమును , క్రోధము కలిగిన వాని సాంగత్యమును పరిత్యజించవలెను.


కామ , క్రోధాదులను నిషేధించవలెను.


ఆలయాలలోను , పూజా మందిరాల వద్దను మంచి నడవడి కలిగి యుండ వలెను.


ప్రశాంత జీవితమును గడుపవలెను.


అన్య దేవతలను దూషించ కూడదు.


అనవసరంగా ఏ ప్రాణికిని కష్టం కలిగించ కూడదు.


పూజా ప్రతిమలను చిత్ర పటములను (పూజా సమయంలోను , పూజ తరువాత) శుభ్రంగా ఉంచుకొనవలెను.


పూలు పత్రి ఒడిలో వేసుకోని పూజించరాదు.


తడి వస్త్రములతో పూజకు ఉపక్రమించకూడదు.


పూజ చేస్తున్నప్పుడు కటిక నేలపై కూర్చుండరాదు.


భోజనానంతరం భోజనం చేసిన ప్రదేశమునందు చేతులు కడుగరాదు (చేతులు కడిగే చోటికి వెళ్ళి చేతులు కడగాలి)


తాంబూలమును స్వీకరించవచ్చునే గాని , తాంబూలమును నమిలి మ్రింగరాదు.


శవమును చూడకూడదు అట్లు చూచినచో మరల తలస్నానం చేసి విభూతి , చందన , కుంకుమాదులు ధరించి దీపం వెలిగించి భగవంతునికి నమస్కరించవలెను.


అశౌచము కలిగిన (మైల కలిగిన) వారి ఇండ్లకు వెళ్ళకూడదు.


స్త్రీలను కనీసం తాకనైన తాకకూడదు. (ప్రాణాపాయ స్థితిలో తప్పు) 


స్వామికి ఇష్టమైన రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహించుట లేక ప్రత్యేకపూజలలో భక్తిగా పాల్గొనుట చేయవలెను.


పుణ్యక్షేత్రములను దర్శించ వలెను.


కన్నెస్వాములనగా మనుసు కలిగిన మాలిన్యరహిత స్వాములు. వీరిచే ఎంగిలి విస్తర్లపై దొర్లించడం , వాటిని మోయించడం. పెద్ద స్వాములచే ఎంగిలి పడిన భోజనమును తినిపించడం , వంటి వారి చేష్టలను , పరమ పవిత్రమైన టెంకాయలోని నేతిని గోరు హరిహరాత్మజుడు ఇష్టపడడు. అది ఎన్నటికిని ప్రియముగాదు. ఆ వికార చేష్టలు అనాచారములు వదలి పరిశుభ్రత పాటించాలి.


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat