🔱 శబరిమల వనయాత్ర - 47 ⚜️ వేలన్ పాట్టు ⚜️

P Madhav Kumar


⚜️ వేలన్ పాట్టు ⚜️


మాళికాపురత్తమ్మ సన్నిధిలో సర్పతర

పక్కన మణిమండపం ఈ మణి మండపమునకు ముందుభాగాన కొంతమంది డోలు , పర అను వాయిద్యములు పెట్టుకొని తమవద్దకు వచ్చే భక్తుల సర్పదోషము , గ్రహదోషము , గృహదోషము వంటివి తొలగుటకు వేలన్ పాట్టు , పుళ్ళువన్ పాట్టు మొదలగు పాటలతో పాడి మన పేరు గోత్రములు చెప్పించి మనకు వాటిల్లి యుండు  దోషములను పోగొడుతారు. సకాల వివాహము కావలసిన యువతీ , యువకుల కోసం కూడా వారి పెద్దవారు ఇచ్చట వారి గోత్ర నామాదులతో దోష పరిహారము చేయుంచు కొందురు. అలనాడు పందళరాజు ఈ ఆలయము నిర్మించిన పిమ్మట ఆ రాజ వంశీయులు మరియు వారితో వచ్చే భక్తులు ఈ వేలన్ పాట్టు పాడించుకునేవారట. అందులకు నిదర్శనగా నేటికిని ఈ పరిపాటి ఇచ్చట కొనసాగుతున్నది.


🙏🪷ఓం శ్రీ స్వామియే శరణం అయప్పా 🌻🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat