కన్నుల నీ సంతోసము గంటిమయ్యా
సన్నల నివెల్ల మాకు సారె జూపవయ్యా!
సెలవుల నవ్వులు చెక్కిళ్ళ చెమటలు
కలిగెగా నేడు నీకు గడుమేలయ్యా
మొలక కెంపులు మోవి, మోమున నిండుగళలు
తొలకీ నీ వన్నిటాను దొడ్డవాడవయ్యా!
కడగన్నుల నాద్దుర కాయమున బులకలు
తడబడీ నీకు నేడు తగునయ్యా
అడియాలాలు సందున నక్కున జనులొత్తులు
ఆడరె జాణడవు నీ వౌదువయ్యా!
శిరసుపై సేసలు కురుల చెదరులును
పరగె నీయందు నేడు బాపురే యయ్యా
యిరవై శ్రీ వేంకటేశ యే నలమేలుమంగను
సరుగ నన్నేలితివి సరసుడవయ్యా!🙏
రాగం - సారంగ.
గానం - శ్రీమతి నిత్యసంతోషిణి.
సంగీతం - శ్రీ నీహాల్.