అమృత బిందువులు - 7 అయ్యప్ప తత్వం - 3

P Madhav Kumar


*అయ్యప్ప తత్వం - 3


మాళిగైపురత్తమ్మ వారి సన్నిధిలోని పసుపుపొడిని భుజించి , తిలకంగా దిద్దుకున్నట్లయితే దీర్ఘకాల రోగములు తొలగుతాయన్నది భక్తుల ధృఢ విశ్వాసము.


శబరిమల వనయాత్రలో భక్తులకోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి కుటీరాలను 'తావకము'లనీ "విరు"లనీ అంటారు.


యోగ్యుడైన ఆధ్యాత్మిక గురువు పాదపద్మములను ఆశ్రయించి దీక్షను పుచ్చుకొనవలెను.


గురుస్వామి ద్వారా *"స్వామియే శరణం అయ్యప్ప"* అనే తారకమంత్ర ఉపదేశమును పొంది భగవంతుని ఎట్లు పూజించవలెనో , ఎట్లు భగవత్సేవ చేయవలెనో నేర్చుకోవలెను.


గురువు చెప్పిన విధి విధానాలను , గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించవలెను. గురుస్వామి ఆజ్ఞను అతి క్రమించకూడదు.


ఉదయ , సాయంకాలముల యందు విధిగా పూజ చేయవలెను.


భగవంతుని అర్చించిన తరువాత ప్రసాదంగా పూజా పుష్పమును శిరముపై నుంచుకొనవలెను.


పూజ ముగిసిన తరువాత అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా దేవాలయాలకు వెళ్ళవలెను.


ఉదయ , సాయంకాలము లందు (రెండు పూటలా) చన్నీటితో తలస్నానం చేయవలెను.


నేలపై చాపవేసుకుని నిద్రించవలెను. (తలగడను ఉపయోగించ కుండా) 


బ్రహ్మచర్యమును ఆచరించవలెను.


పూజా విధానాన్ని సక్రమముగా పాటించే విధంగా దినసరి కార్యక్రమ ప్రణాళికను ఏర్పరచుకొనవలెను.


అసత్య మాడరాదు.


నుదుటను విభూతి , చందన , కుంకుమలు ధరించవలెను.


గురుస్వామిగారి పర్యవేక్షణలో ఆ కాలానికి చెందిన సద్ గురుస్వాముల అడుగుజాడలలో నడుచు కోవలెను.


*భగవంతుని సన్నిధిలో "పడి" వెలిగించునపుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో నాట్యమాడవలెను.*


*ప్రత్యేక పూజలు ముగిసిన పిదప గురుస్వాములకు ఒకరి తరువాత ఒకరుగా క్రమపద్ధతిలో పాద నమస్కారము చేయవలెను.*


ప్రత్యేక పూజ నిర్వహించిన భక్తునకు మిగిలిన స్వాములు సున్నితంగా పాదాభివందనం చేయవలెను.


పూజ చేసిన స్వామి కూడా ఇతర స్వాముల పాదాలకు సున్నితంగా , భక్తిగా నమస్కరించవలెను.


స్వామికి సంబంధించిన ఊరేగింపు ఉత్సవాలలో విధిగా పాల్గొని , కనీసం కొంత దూరమైన నడువవలెను.


దేవుని ఊరేగింపు ముగిసిన పిదప అందుకు సంబంధించిన ఆదాయ , వ్యయములను "స్వామి" సమక్షంలో నివేదించవలెను. ఇదంతా గురుస్వామిగారి ఆజ్ఞమేరకు జరుగవలెను.


దేవాలయముల లోను , ఇంటిలోను వివిధ విశేష పూజలలోను బృందగానములు చేయవలెను.


అయ్యప్ప మాల యందు ఉండే అయ్యప్ప రూపు(డాలర్)కు హారతిని ఇచ్చేటపుడు ఎడమచేతితో మాలను పట్టుకుని కుడిచేతితో హారతిని చూపించాలి (హారతి మంటల్లో మాలను , రూపును త్రిప్పకూడదు.) *అనగా అయ్యప్పకు  హారతిని తిప్పాలి  గాని  హారతి చుట్టూ అయ్యప్ప ను తిప్పకూడదు.*


*నేను చాలా పూజలలో చూశాను కొందరు స్వాములు అయ్యప్ప డాలర్ ను  హారతి చుట్టూ తిప్పుతున్నారు అది చాలా తప్పు*


స్వచ్ఛమైన , శుభ్రత కలిగిన అభిషేక ద్రవ్యములు దొరికినపుడే స్వామికి అభిషేకములు (చేయించవలెను) చేయవలెను. అభిషేక ద్రవ్యాలు మంచివి. కాకపోతే ఆలయంలోని విగ్రహం పాడైపోతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభిషేకానికి మంచి ద్రవ్యాలను సమకూర్చుకోవలెను. 


అభిషేక , "ప్రసాదములను" స్వీకరించవలెను.


ప్రత్యేక పూజల యందును , స్వామిని అలంకరించుటయందును , అర్చనలలోను మరియు చేసే ప్రతీ మంచి పనిలోను ఏకాగ్రత , కలిగియుండవలెను.


భగవంతునికి చేసే సేవ , భగవద్ భక్తులకు చేసే సేవ ఒక్కటే అని భావించి వినయంతో సేవ చేయవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat