అమృత బిందువులు - 9 ఆలోచనా తత్వం - 1

P Madhav Kumar


*ఆలోచనా తత్వం - 1*

పొగిడినంతనే పొంగిపోకు. అందులో మర్మమేమిటో తెలుసుకో. ధర్మమనిపిస్తే సహాయము చెయ్యి. అధర్మమనిపిస్తే వదిలి వెయ్యి.


జీవులపై ప్రేమను చూపండి - దేవుని ప్రేమను పొందండి.


సరియైన మార్గములో నడవని వారు దేనిని సద్వినియోగము చేసుకోలేరు.


జీవితానికి ప్రోత్సాహకర మాటలు అమృతాన్నిచ్చి , వెలుగు మార్గాలను చూపగలవు.


ప్రేరణ ఉపయోగకరమైనదైతే ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది. నిరూపయోగకరమైనదైతే నిలువునా పతనము చేయగలదు.


ఇంట్లో పెట్టి పూజించే దేవుని పంచలోహ విగ్రహాలు ఇంటి యజమాని బ్రొటనవేలి పరిమాణంలోనే ఉండాలి. ఆ సైజుకంటే పెద్దదిగా ఉండకూడదు , ఉండినచో దానికి తగిన రీతిగా ఆరాధనలు చేయవలసి వచ్చును.


ఒక ఆడపిల్లను చదివించుట ఒక కుటుంబమును పోషించు నంత ఫలితము నిచ్చును. 


మాట జారితే తిరిగి రాదు , కనుక ఆలోచించి మాట్లాడాలి.


గతం నుంచి ప్రేరణ పొంది వర్తమానంలో భవిష్యత్తు గురించి ఆలోచించాలి.


బాగా ఆలోచించు. కొద్దిగా మాట్లాడు , తక్కువగా వ్రాయి. 


భగవంతుని శరణు జొచ్చిన వానిని విధికూడా వేధించనెంచదు. అట్టివాని నుదుట బ్రహ్మ తాను వ్రాసిన వ్రాతను తానే మార్చివేయును.


సూటి పోటి మాటలు సుడిగుండాలకన్నా భయంకరమైనవి. సుడి గుండాల్లో పడితే అదృష్టవశాత్తు తప్పించుకోవచ్చునేమో గాని , సూటి పోటు మాటలు సుడిగుండాల్లో పడితే తప్పించుకోలేము.


అందం కలిగిన వారే అపురూపులని భ్రమపడకండి. అంద విహీనులలో మంచి గుణము కలిగిన వారే అందమైన వారు కాగలరు.


మూర్ఖత్వమునకు మందులేదు. అది అనుభవించవలసినదే.


పెద్దవారితో స్నేహము పేదరికానికి పోటు లాంటిది.


ఆలోచించకుండ అమలు పరచడము నియంత లక్షణము కాగలదు. 


నిరాశ తుఫాను లాంటిది. తుఫాను తాకిడికి గురైతే ఎంత ఆపదనో అలాగే నిరాశకు లోనైనా అంతే ఆపద ఉండును.


కంచె లేని పొలానికి రక్షణ లేనట్లే శిక్షణ లేని జీవితానికి కూడా రక్షణ ఉండదు.


దేనినైనా నిర్ణయించి తీర్పునిచ్చేది కాలమే దానికి ప్రతి ఒక్కరు తలవంచవలసిందే.


విచక్షణ లేని మనిషి ఉప్పెన లాంటివాడు , ఉప్పెన వలన ప్రమాదాలు జరిగినట్లు విచక్షణ లేని మనిషి వలన కూడా ప్రమాదాలు జరుగగలవు.


ఆత్మతృప్తి అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకో , అపుడు బాధలు ఉండవు. హెచ్చు తగ్గులు అగుపడవు..


ఆత్మతృప్తి గలవానికి అందులోనే సుఖ మనే చక్కటి అమృత బిందువులు లభించును.


ఫలించని దాని కోసము ప్రయత్నించకు. ఫలించే దాని కోసం ప్రయత్నించు. అదియే వివేకము.


యదార్థమైన విభేదాలు తరచుగా సక్రమమైన అభివృద్ధికి చిహ్నాలు.


ఏ కొద్దిపాటి అవకాశం దొరికినా మనిషి ఎప్పుడూ ఆశావాదియే


ఆలోచనలకు , మాటలకు తేడా ఉండరాదు.


ఆలోచించక చేసేపనులు తరువాత దుఃఖింప జేయును.


నిద్రకోసం పరుండు వాడు సంసారి నిద్ర వచ్చినపుడు పరుండువాడు సన్యాసి.


అవిటివాడు అందలం ఎక్కాలనుకోనేకూడదు ! అది వృధాశ్రమయగును.


గ్రుడ్డివాడు చిత్రం గీయాలనుకోనే కూడదు ! అది వల్లకానిదగును.


మూగవాడు సంగీతం ఆలపించాలనుకోనే కూడదు ! అదిసాధ్యంకానిది. 


కసాయివాడు పాపపుణ్యాలు ఆలోచించనేకూడదు ! అది వృత్తికి వ్యతిరేకము. 


హృద్రోగి కొండ ఎక్కాలనుకోనేకూడదు ! అది హానికరం.


కడుపు నొప్పివాడు విందు ఆరగించాలనుకోనేకూడదు! అది అపాయం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat