అగ్ని హోత్రము - Agni Hotramu

P Madhav Kumar

 

 అగ్నిహొత్రం
కింద చెప్పబొవు సనాతన అగ్ని కార్యం సులువుగా ఉన్నా , తప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా చేయరాదు.

అగ్నిహోత్రం గురించి సంపూర్ణ వివరణ: 
ప్రస్తుతం మన పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మీకు అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది కదా ! ఇలాంటి సమస్య రావడానికి ప్రధానకారణం. మనకి, ప్రకృతికి మధ్య ఉన్న బంధం చెరిగిపోవడమే.

ప్రకృతి ఒక నియమబద్దంగా తనపని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాని మనుష్యులు ప్రకృతివిరుద్ధంగా ప్రవర్తించడం వలన ప్రకృతి జూలు విదులుస్తుంది. అటువంటి సమయాల్లోనే ఇప్పుడు మనం చూస్తున్న విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సమస్త మానవాళిని కాపాడటానికి మన సనాతన సంప్రదాయవాదులు ఋషులు మనకి అనేక గొప్పగొప్ప నియమాలు ఏర్పరిచారు. ఈ నియమాలు కొన్నివేల సంవత్సరాల నుంచి మన భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయాయి. కాని నాగరికత పేరుతో సంప్రదాయ పద్ధతులు వదిలివేసి మనుష్యులు తమ శక్తిని , ఆయుష్షును కోల్పోతున్నారు.
నిత్యాగ్నిహోత్రం సాక్షిగా వైదిక వివాహం చేసుకుంటున్న విదేశీయులు !
నిత్యాగ్నిహోత్రం సాక్షిగా వైదిక వివాహం చేసుకుంటున్న విదేశీయులు !
నిత్యాగ్నిహోత్రం
మన సనాతన భారతీయుల గృహాల్లో నిత్యం అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది. దీనికి కారణం ఆ అగ్నిహోత్రం నందు అనేకరకాలైన ఔషధ మూలికలను మండించడం ద్వారా చుట్టుపక్కల గాలిలో ఉండే వైరస్ మరియు బ్యాక్టీరియా సమూలంగా నాశనం అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. మనందరం మరిచిపోయిన మన సనాతన సంప్రదాయం అయిన అహోగ్నిత్రం గురించి , దాని గొప్పతనం గురించి సంపూర్ణంగా మీకు వివరిస్తాను . 

అసలు మొదట అగ్నిహోత్రం అంటే ఏమిటి?
సరిగ్గా సూర్యోదయం , సూర్యాస్తమయ సమయముల యందు పిరమిడ్ ఆకారపు రాగిపాత్రలో అగ్నిని రగిలించవలెను. 
  • ⧫ అగ్నిహోత్రమునకు ఎండిన ఆవుపిడకలు, 
  • ⧫ ఔషధయుక్తమైన ప్రత్యేకమైన వనమూలికలు అనగా జిల్లేడు , 
  • ⧫ మోదుగ , 
  • ⧫ చండ్ర , 
  • ⧫ దర్భ , 
  • ⧫ గరిక వగైరా వంటి మాత్రమే వాడవలెను. 
ఒకవేళ అటువంటి మూలికలు దొరకానిచో ముండ్లు లేనివి , చేదు లేని తియ్యటి పండ్లు కాయు ఏ చెట్టునైనా ఉపయోగించవచ్చు. ఆవునెయ్యి , గోధుమరంగు బియ్యపు అన్నమును హావిస్సుగా అగ్నికి అర్పించుచూ మీకు వచ్చింది ఏవైనా ఒకటి రెండు మంత్రాలను ఆ సమయములో ఉచ్చరించవలెను.

ఇట్టి అగ్నిహోత్రమును సులభముగా ఎవరైననూ ఆచరించవచ్చు. వాతావరణంలో ఏ విధమైన మార్పు సంభవించినను అది వెంటనే ప్రాణము మీద ప్రభావం చూపించును. ప్రాణము మరియు మనస్సు అనేది బొమ్మ , బొరుసుల వలే ఒక నాణెముకు రెండువైపులు అని చెప్పవచ్చు.

ఇది వేదములోని హోమథెరఫీ విధాన ప్రక్రియ వివరణము. మనము అగ్నిని ప్రేరిపించినప్పుడు వాతావరణములో మార్పు కలుగుట సహజమే కదా ! మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ మంత్రాల ప్రకంపనాలు వాతవరణం లో ప్రయాణించును. ఈ అగ్నిహోత్ర ప్రభావం బాలుర మీద అత్యంత ప్రభావం చూపించును.అత్యంత తెలివి,పరిపూర్ణత,దయ సంపన్న గుణములతో వారు ప్రవర్తించును. అగ్నిహోత్రపు బూడిద మీద పరిశోధన చేసిన జర్మనీ పరిశోధకులు ఇది ఒక మహోత్తర శక్తివంతమైన ఆయుధం అని క్యాన్సర్ వంటి మొండివ్యాధులను కూడా నయం చేయగలదని తెలుసుకొన్నారు.
ఇప్పుడు మూలికల ఔషధ గుణాలు వివరణ: 
  • ⭄ అందులో మొదటిది జిల్లేడు.ఈ జిల్లేడులో తెల్లది , ఎర్రది అని రెండుజాతులు కలవు. 
  •  తెల్లజాతికి గుణం ఎక్కువ అని ఆయుర్వేద వైద్యుల సూచన.
  • ⭄ కఫ, వాత వ్యాధులను హరించును .
  • ⭄ ప్రథమ దశలోని కుష్టువ్యాధిని నయం చేయును . 
  • ⭄ జీరకోశము నందలి జబ్బులను,
  • ⭄ పేగులయందలి క్రిములనుచంపును. 
  • ⭄ దీని ఆకుపోగ ఉబ్బసరోగులకు హితముగా ఉండును.
  • ⭄ దీని వేరు బెరడు నీటిలో వేసి కాచి ఆ నీటిని కొద్దిగా తాగించిన చలిజ్వరం , రోజుమార్చి రోజు వచ్చే జ్వరములు తగ్గును.
సంకలనం: ఋషి పరం పర

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat