🌿శ్రీమహాలక్ష్మికి ప్రియ స్నేహితురాలు తులసీదేవి. శ్రీమన్నారాయణుని మనసుకు ఎంతో ఇష్టమైనది ఈ తులసిమాత.
🌸పుణ్యరాశి. పాపాలను పటాపంచలు చేస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం, స్కాందపురాణం, పద్మపురాణాలలో తులసి మహిమ వర్ణితమైంది.
🌿యన్మూలే సర్వతీర్థాని' అనే ప్రసిద్ధ శ్లోకం "తులసి పాదులో సర్వతీర్థాలు ఉన్నాయి. తులసిచెట్టు మధ్యలో సర్వదేవతలు ఉన్నారు. తులసి చివరిలో సర్వవేదాలు ఉన్నాయి" అని చెబుతోంది. పరిమళ భరితమైన తులసి శ్రీకృష్ణునికి చాలా ప్రీతి.
🌸తులసి జాతులలో కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ప్రసిద్ధమైనవి. దేనితో అయినా దేవుని పూజించవచ్చు. ఇంటిలోని లక్ష్మీ తులసిని కోటలో ఉంచి గృహిణులు నిత్యం పూజచేసి ఈ శ్లోకాన్ని చదవాలి.
🌿సౌభాగ్యం సంతతిందేవి ధనధాన్యంచమే సదా
ఆరోగ్యం శోకసమనం కురుమే మాధవప్రియే
🌸పూజకు మూడునాలుగు ఆకులు కలిసి ఉన్న తులసిదళాన్నే వాడాలి. కోటలోని తులసిని వాడకూడదు.
🌿తులసితీర్థం డయాబెటిస్, బిపిలకు మంచి మందు. రక్తశుద్ధి చేస్తుంది.
🌸సూర్యాస్తమయం తర్వాత తులసిని కోయకూడదు. తులసిచెట్టు నీడలో శ్రాద్ధం చేస్తే పితృతృప్తి అవుతుందట. తులసి మహాత్మ్యం ఇంత వర్ణించలేనిది.
🌹శుభంభూయాత్..🚩