*ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేసి మంచి ఆలోచనలను కలిగిస్తుంది...* 💎
ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి.....!!
🌟సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే నాగ సిందూరం కుంకుమను బొట్టు పెట్టుకోండి.
🌟పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా..సౌభాగ్యవతులే కాకుండా..మగవారే కాకుండా.. వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా.. నాగసింధూరము ధరించవచ్చు.
🌟ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము.
🌟ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
🌟పిల్లలు, పెద్దలూ, మగవారు, స్త్రీలు అంతా నుదుట బొట్టు ధరించడం భారతీయ సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ… ఏది ధరించినా మంచిదేనని హైందవ ధర్మం తెలుపుతుంది.
🌟నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నెమ్మదిగా నొక్కుతూ సిందూరాన్ని కానీ, కుంకుమను కాని పెట్టుకోవటం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం తెలుపుతుంది.
🌟పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ముత్తైదువుల ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు హిందూ స్త్రీలు.
🌟శుభకార్యాలకు బొట్టుపెట్టి పిలవటం హిందూ సాంప్రదాయం.నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ పరిగణిస్తారు.
🌟అది పీనియల్ గ్రంథి స్థానం కూడా. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు.
🌟వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి అందం కూడా వస్తుంది. చూసేవారికి కూడా ముచ్చటగా ఉంటుంది. బొట్టు పెట్టుకున్నవారి మీద ఎదుటవారిలో గౌరవం కలుగుతుంది.