🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ఆధ్యాత్మిక చింతను మారుపేరైన భారతదేశంలో అనేక పవిత్ర దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ,
ప్రాయశ్చిత్త స్ధలాలు వున్నయి.
🌸ఈ స్థలాలను దర్శించి భక్తులు తమ భయభ్రాంతులను , చింతలను మరచిపోయి నిశ్చింతగా వుంటారు.
🌿కష్టాలు కలిగినప్పుడు ప్రార్ధించుకుని స్వాంతన పొంది, శక్తిని పెంపొందించుకునేందుకు ఏర్పడిన పుణ్యస్ధలాలు.ఏదైనా ఒక పుణ్య క్షేత్ర
దర్శనం చేసుకుని వచ్చిన తరువాత జీవితంలో పెద్ద మార్పులు కలిగి శుభాలు జరగడం , మనసు కి ప్రశాంతత లభించడం వంటివి సంభవిస్తూంటాయి.
🌸అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించే ఆలయం తిరువారూరు జిల్లాలోని
పేరళం సమీపమున వున్న
తిరుక్కొడియలూరులో వుంది.
ఈ ఆలయంలోనే శ్రీ ఆనందవల్లీ సమేత అగస్త్యేశ్వ్వర స్వామి కొలువైయున్నాడు.
🌿ఈ పుణ్యస్థలంలోనే యమధర్మరాజు, శనీశ్వరుడు అవతరించినట్లుగా చెప్తారు. శని దోషం, మృత్యుభయమే
ఒక వ్యక్తికి అత్యంత క్లిష్టమైనది.
అటువంటి కాల దోషాన్ని తొలగించి, భక్తులకు ఎటువంటి భయభ్రాంతులు లేకుండా యముడు శనీశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు.
🌸అందువలననే ఈ ప్రదేశంలో
అడుగు పెట్టగానే , చీకాకులు
తొలగి ప్రశాంతత కలుగుతుంది.
ఒకానొక కాలంలో సూర్యుదేవుని భార్యలైన ఉషాదేవి
ఛాయాదేవీ సంతాన భాగ్యం కోసం ఇక్కడి ఈశ్వరుని ప్రార్ధించారు.
🌿అందుకు ఈశ్వరుడు " మీరు మీభర్తతో వెళ్ళి తిరుమీయచ్చూర్ లో వున్న పుష్కరిణిలో స్నానం చేసి అక్కడ
నన్ను , లలితాంబిక ని పూజించి ఇక్కడికి వస్తే మీకు పుత్ర భాగ్యం లభిస్తుంది." అని వరమిచ్చాడు. i
🌸ఆ విధంగానే సూర్యుడు , ఉషాదేవి, ఛాయాదేవి తిరుమీయచ్చూర్ వచ్చి అక్కడిసూర్య పుష్కరిణిలో స్నానాలు చేసి పూజలు చేశారు. ఆ పూజల ఫలంగా ఉషాదేవికి యమధర్మరాజు ,
ఛాయా దేవికి శనీశ్వరుడు
జన్మించారు.
🌿తిరుమీయచ్చూర్ లో పూజించి, యీప్రదేశంలో సూర్యుడు, ఉషాదేవి, ఛాయాదేవి కూడినందు వలన యీ ఊరికి కూడియలూరు అనే పేరు వచ్చింది.
🌸అదే కాలక్రమేణా
"కొడియలూరు"గా పిలువబడుతున్నది.
హయగ్రీవ స్వామి ఆదేశ ప్రకారం తిరుమీయచ్చూర్ వచ్చిన అగస్త్య మహర్షి లలితాంబికాదేవిని మనసారవేడుకుని "లలితా నవరత్న
మాలికా "స్తోత్రంతో లలితా దేవిని స్తుతించి ఆ దేవి అనుగ్రహం పొందాడు.
🌿ఆ తరువాత పరమేశ్వరుని సేవించుకోవాలని కొడియలూరికి వచ్చాడు. అక్కడ ఒక శివలింగాన్ని
ప్రతిష్టించి పూజించాడు.
అందువలననే ,ఇక్కడి ఈశ్వరుడికి అగస్త్యేశ్వ్వరుడు అనే పేరు వచ్చింది.
ఈశ్వరుని పక్కనే లలితా దేవిని కూడా ప్రతిష్టించి పూజించాడు.
🌸వేడుకున్న భక్తుల జీవితాలలో ఆనందాన్ని ప్రసాదిస్తున్న ఈ అంబికను "ఆనందవల్లి తాయారు" అని పిలుస్తారు.
🌿తిరుమీయచ్చూరు ఆలయంలో లలితాపరమేశ్వరి తపో భంగిమలో మనోన్మణి స్వరూపంగా, ఆశీనురాలై అనుగ్రహం ప్రసాదిస్తున్నది.
🌸కొడియలూరు లలితా పరమేశ్వరి ఆనందవల్లిగా పరిపూర్ణత పొంది భక్తులను అనుగ్రహిస్తున్నది.
🌿ఈ ఆలయ దక్షిణ దిశలో
యమధర్మరాజు, ఉత్తర దిశలో
శనీశ్వరుడు దర్శనమనుగ్రహించడం
విశిష్టత కలిగిన విషయం.
🌸ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే యమ భయం , శని దోషము తొలగిపోతాయని భక్తుల ధృఢవిశ్వాసం.
🌿ఈ తిరుమీయచ్చూర్ ఆలయంలోని యమధర్మ రాజుని , శనీశ్వరుని అభిషేకించి , భక్తితో పూజిస్తే తాము పోగొట్టుకున్న విలువైన
వస్తువులు మరల దొరికి శుభాలు
జరుగుతాయని భక్తుల విశ్వాసం.
🌸ఏలిన నాటి శని దోషానికి , ఇతర
సమస్యలకు
యీ ప్రదేశంలో విముక్తి
కలుగుతుంది..🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏