మాంగళ్యసూత్రం

P Madhav Kumar

  


మంగళసుత్రాల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అయిదవతనం మరియు
భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది.

పెళ్లి ఐన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు అయితే భర్త భార్యకి కట్టినప్పుడు వేదం మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది అయితే భార్య మెడలో మంగళసూత్రం మరియు నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను మరియు సంతోషాలను కాపాడుతుంది. అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి కాపాడుతుంది. అయితే మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్దిస్తుంది.

* తాళి బొట్టు గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు

 ప్రతి శుక్రవారం మరియు మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగలసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలాగా చేస్తే ఐదావతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది.

 మంగళసూత్రాలకు పి న్నీసులు మరియు ఏ ఇతర ఇనుముకి  సంభందించినవి పెట్టకూడదు.

 మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి.

 మంగలసుత్రాలకి ఎప్పుడు  పగడం, ముత్యం మరియు నలుపు పూసలు ఉండాలి.

* పొరపాటున మంగలసుత్రాలు పెరిగిపోతే(తెగిపోతే) ఏమి చెయ్యాలి?

వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి.

మంచి రోజు చూసి ఉదయం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి.

సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat