పాము భయం ఉన్నవారు ఏ క్షేత్రాన్ని దర్శించాలో తెలుసా ?

P Madhav Kumar


🌿సాధారణంగా కొందరికి తరచూ పాములు కలలో కనిపిస్తుంటాయి. అదేవిధంగా పాములను చూస్తే మరికొందరికి ఎంతో భయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే పాములను తలచుకున్నప్పుడల్లా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

🌸 అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. 

ఈ విధంగా పాము భయం ఉన్నవారు శివాలయానికి వెళ్లి పూజలు చేయించడం, లేదా పుట్టకు వెళ్లి పాలు పోసి కొబ్బరికాయ కొట్టుకొని రావడం వంటివి చేస్తుంటారు. 


🌿ఈ విధంగా చేసినప్పటికీ కొందరిలో ఈ భయం అలాగే వెంటాడుతుంటుంది. ఈ విధంగా పాములను చూస్తే భయపడేవారు, ..



🌸ఈ పాముల భయం తొలగిపోవాలంటే ఏం చేయాలి ?

ఏ ఆలయానికి వెళితే ఈ భయం తొలగిపోతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..


🌿కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరుకు 10 కి.మీ దూరంలో ఉన్న కుడుపు అనే గ్రామంలో వుంది. 

కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అనే అర్థం వస్తుంది. 


🌸ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి పాము ఆకృతిలో ఉండే ఐదు తలలతో భక్తులకు దర్శనమిస్తున్నాడు.

అయితే ఎవరైతే పాముల వల్ల ఎక్కువగా భయపడుతుంటారో అలాంటి వారు ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం వల్ల వారికి పాము నుంచి కలిగే భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.


🌿ఈ క్రమంలోనే ప్రతి సోమవారం శ్రావణ మాసంలోని 5 వ రోజు వచ్చే నాగపంచమికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


🌸 ముఖ్యంగా ఈ గ్రామంలోని మహిళలు ఆవు పేడ,ఆవు పాలను కలిపి తమ ఇంటి గోడలపై పాము చిత్రాలను గీస్తారు. ఈ విధంగా ఇంటి గోడలపై చిత్రాలు గీయటం వల్ల వారికి పాములు కాటు వేయవని అక్కడ ప్రజలు ఎంతగానో విశ్వసిస్తారు.


🌿ఈ క్రమంలోనే పాము భయం ఉన్నవారు శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజు పెద్దఎత్తున ఆలయానికి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడం వల్ల పాము భయం పూర్తిగా తొలగిపోతుంది అని విశ్వాసం.....స్వస్తీ...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat