👉శ్రీ నాగుల మల్లిఖార్జున ఆలయం - కరీంనగర్ జిల్లా : న్యూమారేడుపాక

P Madhav Kumar

👉శ్రీ  నాగుల మల్లిఖార్జున ఆలయం

💠 భక్తుల ఇష్టదైవం కొలిచిన వారికి కోర్కెలు తీర్చే దేవునిగా, భక్తుల పాలిట కొంగుబంగారమై నిత్య పూజలందుకునే ప్రత్యక్ష దైవంగా వెలిశాడు నాగుల మల్లికార్జునుడు. 


💠 రామగుండం మండలం న్యూమారేడుపాక గ్రామంలో వెలసిన ఈ మల్లికార్జునికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. 


💠 ఒకప్పుడు నిత్యం భక్తుల రద్దీతో ఉండే ఈ దేవాలయం బొగ్గుగనుల విస్తరణ మూలంగా ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


💠 నాగుల మల్లికార్జునిడిగా పిలవబడుతున్న మల్లికార్జునస్వామికి ఈ ప్రాంతంలో రెండు దేవాలయాలున్నాయి. 

రెండు దేవాలయాలు ఉండడానికి కూడా కారణం ఉంది.


💠 ఆలయచరిత్ర : 


🔅 సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మారేడుపాక గ్రామ సమీపంలో ఉన్న పోచంపల్లి  గ్రామంలో మల్లికార్జునుడు ఒక పుట్టలో సర్పరూపంలో తిరుగుతూ భక్తులు కోరిన కోరికలు తీర్చేవాడట.

 కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగుబంగారమైన ఆ దైవాన్ని భక్తులు నాగుల మల్లికార్జునుడిగా పిలుచుకునే వారు. 

చుట్టు పక్కల గ్రామాల నుండి ప్రతిరోజు భక్తులు ఇక్కడికి వచ్చి బోనాలు చేసి పట్నాలు వేయడం ఈ ఆలయ ప్రత్యేకత.


💠 నూతన దేవాలయం నిర్మాణం : 


🔅 సింగరేణి సంస్థ బొగ్గుగనుల తవ్వకాలలో భాగంగా పోచంపల్లి, మారెడుపాక గ్రామాలను తరలించింది. 

దీంతో పోచంపల్లిలో దేవాలయం మాత్రమే మిగిలింది.

అక్కడి గ్రామ ప్రజలతో నూతనంగా నాగుల మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించుకున్నారు. 


💠 ఆలయ విశిష్టత : 


🔅 విశాల స్థలంలో నిర్మించిన దేవాలయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 

ఎత్తయిన ధ్వజస్తంభంతో ఉండే దేవాలయంలో శ్రీ నాగుల మల్లికార్జునస్వామి విగ్రహం, పుట్ట పక్కనే లింగరూప మహాశివుడు, పెద్ద నందీశ్వరుడు, అమ్మవారి విగ్రహం, నవగ్రహ విగ్రహాలు, వేపచెట్టుకింద వెలసిన పోచమ్మతల్లి కొలవై కనిపిస్తారు. 

ఒగ్గువారితో ఆలయం ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంది.


💠 మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా  జరుగుతాయి.


💠 పాత ఆలయానికి భక్తుల తాకిడి న్యూమారేడుపాకలో తిరిగి దేవాలయం నిర్మించినప్పటికీ పాత ఆ ఆలయానికి భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. 

చుట్టూ  మట్టికుప్పలు పోసినప్పటికీ భక్తులు  మట్టికుప్పలు దాటుకుంటూ, ముళ్లపొదలను దాటుకుంటూ పాత ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు.


💠 కొసమెరుపు : 


🔅 తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద నంది విగ్రహం ఈ మారుమూల ఆలయంలో ఉండడం ఒక విశేషం అయితే... ఈ విషయం కానీ ఈ ఆలయం గురించి తెలంగాణ ప్రజల్లో కూడా సరి అయిన ప్రచారం లేకపోవడం శోచనీయం.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat