అనివార్య కారణాల వల్ల వ్రతం కానీ పూజ కానీ అసంపూర్ణానంగా ఆగిపోతే పాపమా?దోషమా?

P Madhav Kumar


చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఏదైనా వ్రతం కానీ, పుణ్యకార్యం కానీ, ధ్యానం కానీ మధ్యలో ఆపితే పాపం వస్తుంది అని భయపడుతుంటారు.అటువంటిది ఏమీలేదు అని..


"ఓ అర్జునా! పూర్తిగా సిద్ధి పొందకుండా, ఏ కారణం చేతనైనా, మధ్యలో యోగం అభ్యాసం చేయడం విరమించిన వారిని యోగభ్రష్టులు అని అంటారు. అటుంటి వారికి ఎటువంటి వినాశం అంటే నష్టం ఉండదు. మంచి పనులు చేసే వాడికి ఎప్పుడు కూడా దుర్గతి కలగదు." అంటూ పరమాత్మ స్పష్టం చేస్తున్నాడు. 

   అయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపూజ చేసినా, వ్రతం చేసినా, దేవుడి మీద భక్తితో చేయాలి కానీ, భయంతో కాదు.


యోగాభ్యాసం, ధ్యానం చేసే వారు మధ్యలో జారి పోయినా, విధివశాత్తు మరణించినా వారికి ఎటువంటి దుర్గతి పట్టదు. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా వారికి ఎటువంటి దుర్గతి సంభవించదు. అంటే దీని భావం మనం ఎటువంటి పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం వస్తుంది. ఎంత చేస్తే అంతే వస్తుంది. అంతేకానీ ఎటువంటి చెడు ఫలితము రాదు. చేసేది మంచి పని కాబట్టి ఎంత చేసినా దానికి ఫలితం వస్తుంది కానీ ఎటువంటి దుర్గతి కలుగదు. 


లోకకల్యాణమైన పనులు అంటే లోకానికి మంచి చేయడం. ఇతరులకు సాయ పడటం, శాస్త్రాలను చదివి ఇతరులకు బోధించడం, సమాజ సేవ చేయడం, ఉన్నదాంట్లో ఇతరులకు సాయపడటం. సాటి వారిని బాధ, హింస పెట్టకుండా, ఇతరుల క్షేమాన్ని కోరుకోవడం ఇవీ మంచి పనులు. ఇవి ఎంత చేస్తే అంతఫలం మన కాతాకు చేరుతుంది. దానికి తగ్గఫలం ఈ లోకంలో కానీ పరలోకంలో గానీ లభిస్తుంది. ఇది పరమాత్మ మనకు చేసిన వాగ్దానం.


ఎటువంటి పుణ్యకార్యాలు, ధ్యానాలు చేయని వారికి దుర్గతులు కలుగుతాయి. వారు చేసిన పాపపు పనులకు తగిన ఫలం అనుభవిస్తారు. పాపం చేసే వారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా వారి పాపాలకు ఫలితం అనుభవించక తప్పదు. ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా దానికి తగిన ఫలం ఈ జన్మలో కానీ మరుజన్మలో కానీ దక్కినట్టే, ఎంత చిన్న పాపం చేసినా దాని ఫలితం ఎప్పుడైనా అనుభవించక తప్పదు.

🙏🌞🙏🌞🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat