*పరమేశ్వరుని శిరోలంకారం తదియ చంద్రుడు అన్ని ఎందుకు అంటారు?* 🌹

P Madhav Kumar


 *పరమేశ్వరుని శిరోలంకారం తదియ చంద్రుడు* 

 *మనిషి మనోభావన* 


🍂కారకుడైన చంద్రుని తదియనాడు దర్శిస్తే, ఆ వ్యక్తి కుటుంబం లో ఐకమత్యం,మనశ్శాంతి , ఆరోగ్యం, మంచి కంటి దృష్టి వంటి మంచి ఫలితాలు ఎన్నో లభిస్తాయి.


🍂పరమాత్మ నుండి ఆవిర్భవించినవాడు చంద్రుడు (చంద్రమా మనసోజాతః) అని వేదాలు చెపుతున్నాయి. పరమాత్మ ప్రపంచ రూపం. ప్రపంచానికి మనో కారకుడైన చంద్రుడు ఋతువులను ఏర్పరిచి లోకంలో సుఖ సంతోషాలకు కారకుడైయ్యాడని వేదాలు వివరిస్తున్నవి. జ్యోతిష్య శాస్త్రం కూడా చంద్రుడుమనో కారకుడని వివరిస్తున్నది.


🍂అమావాస్యనాడు సూర్యుని లో మరుగైన చంద్రుడు ఒక్కొక్క రోజు కిరణాలను పొందుతూ పెరిగి 15 వ రోజు పూర్ణ చంద్రునిగా దర్శనమిస్తాడు. వేదం "పంచదశ్యామాపూర్యతే" అని వేదం పౌర్ణమిని వర్ణిస్తుంది.


🍂పాడ్యమి నుండి చంద్రుడు తనలోని కిరణాలను ఒక్కొక్కటిగా భాగం మరుగై సూర్యుని లో కలసి పోవడానికిఅమావాస్య అంటారు.


🍂పూర్వీకులు తమ నూతన కార్యక్రమాలను అభివృద్ధి పధకాలను శుక్ల పక్షం నుండే ప్రారంభించేవారు.


 *ప్రతి సోమవారం నాడు చంద్రుని పూజించడం శుభదాయకం.* 

🍂ఈవిధంగా పురాణ గ్రంధాలు తదియ చంద్రుని దర్శనం శుభప్రదమని కీర్తిస్తాయి.


🍂ఎనభై సంవత్సరాలు నిండినవారినివేయి పున్నమిలు చూసిన వారని అంటారు.వారి నుండి ఆశీర్వాదాలు పొందడం భాగ్యంగా భావిస్తారు.


🍂చంద్రోదయ దర్శనమంటే.. అమావాస్య నుండి మూడవ రోజు ఆకాశంలో చిన్న గీత వలే కనిపించే తదియ చంద్రునిదర్శనమే చంద్రోదయ దర్శనం అంటారు.ఆకాశంలో కొద్ది క్షణాలు మాత్రమే దర్శనమిచ్చేచంద్రుని వీక్షించడాన్ని చంద్రోదయ దర్శనం అంటారు.


🍂తదియ చంద్రుని దర్శనం దైవీక శక్తి కలది.అది భగవంతుని దర్శనంగానే భావించబడుతున్నది. కారణమేమంటే ఈశ్వరుడే ఈ తదియ చంద్రుని తన శిరస్సుపై అలంకారంగా ధరించుకున్నాడు. దీని వెనుక ఒక రసవత్తరమైన కధ వున్నది. 


🍂దక్షుని శాపం వలన తన పదహారు కళలు కోల్పోయిన చంద్రుడు తిరిగి వాటిని పొందడానికిభగవంతుని ప్రార్ధిస్తూ తపస్సు చేశాడు.దిన దినానికి క్షీణించిపోతున్న చంద్రుని దేహంచూసి అతని 27 మంది భార్యలు దుఃఖించారు. వారు తమ తండ్రి వద్దకు వెళ్ళి చంద్రునిశాప విమోచనానికై ప్రార్ధించారు.


🍂" నేను చంద్రునికి శాపం ఇచ్చినందున నేను నా తపోశక్తి కకోల్పోయాను. శాప విమోచనం చేయడానికి నాకు శక్తి లేదు" అని అన్నాడు దక్షుడు. అప్పుడు చంద్రుని భార్యలు సూర్యమండలంలోఆశీనులై కఠోర తపస్సు చేశారు.


🍂శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు.మేము ఉత్తమమైన దైవాంశతో ప్రకాశించడానికి వరం ప్రసాదించమని కోరారుచంద్రుని భార్యలు వరం ప్రసాదించాడు పరమేశ్వరుడు తక్షణమే వారు ఆకాశంలో ప్రకాశించే 27నక్షత్రాలు గా మారిపోయేరు. చంద్రుని తపస్సు పరిపూర్ణ మైనది చంద్రుడు తనభార్యలకు స్ధూల రూపం లేనందుకు విచారించాడు కరుణామయుడైన పరమశివుడు 27 మందికి పూర్వపు రూపంఅనుగ్రహించాడు తిరిగి చంద్రుడు తన భార్యలతో చేరి తపస్సు చేశాడు.ఫలితంగాపరమేశ్వరుని ఝుటా ఝూటంలోఅలంకారంగా అమరి శాశ్వత కీర్తి పొందాడు 16 కళలు పోగొట్టుకున్నచంద్రుడు మాసంలో 15 రోజులు తన కళలువృధ్ధి చెందేలాగ వరం పొందాడు.


🍂ఈవిధంగా తదియతిధి నాడు చంద్రశేఖరుని ధ్యానించి పూజించడంపుణ్యదాయకం.ఆనాడు చంద్రుని దర్శించడం వలనవిశేషమైన ఫలితాలు లభిస్తాయి.


" *సం సోమాయ నమః* " అని చంద్రుని ధ్యానిస్తే మనోచాంచల్యం తొలగిమనసుకి ప్రశాంతత చేకూరుతుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat