*జీవన తత్వం - 5
సకల బంధములు తాత్కాలికమైనవే అను సత్యమును ముఖ్యముగా వృద్ధులు తెలిసికొని , తమకు సొంతం భగవంతుడు మాత్రమే యని తెలుసుకొని , భగవంతుని మీద భక్తి భావాన్ని పెంచుకొని , చివరి దినములను గడుపవలెను.
తన భార్యా బిడ్డలు , మనుమల్లు మనుమరాలను గూడా తానే పోషించి కాపాడుచున్నామను భావన చాలా విపత్కరమైన దగును. సృష్టించినవాడు భగవంతుడు అందరినీ కాపాడే వాడు అతడే అను భావనను పెంచుకొని మసలే వారికి బాధలుండవు.
క్రమశిక్షణలో లోపం వుంటే క్షీణదశకు చేరువ అవుతావు.
మహర్షులు మాట్లాడరు. మేధావులు మాట్లాడుతారు. మూర్ఖులు వాదిస్తారు.
స్వార్థ చింతనలేనపుడే ఘన కార్యం సాధ్యమవుతుంది.
ప్రేమించడం ఉత్తమ సంస్కారము. అందర్నీ ప్రేమించగలగడం మహోన్నత సంస్కారం.
తోటి మానవుని ప్రేమించడమే భగవంతుని ప్రేమించడం.
శారీరకబలం వ్యక్తిత్వబలం ముందు నిలబడలేదు.
మనిషి స్వేచ్ఛకు బానిస.
చిన్న చిన్న సంతోషములను అనుభవించుటకు నేర్చుకున్నవారే పరమానందమును పొందుటకు అర్హులు.
స్నేహానికి కాలం గుర్తు , వేగంగా ఏర్పడే స్నేహాలు అదే వేగంగా మాసి పోతాయి.
నిన్ను నీవు పొగడుకోకు - ఎవ్వరు నమ్మరు. నిన్ను నీవు కించపరచుకోకు - అదే నిజమనుకొంటారు.
మానవునికి బ్రహ్మజ్ఞానము కలవారియుందు భక్తి , శివపూజ , దాన శీలత , సజ్జన సాంగత్యం. ఈ నాలుగూ ఉండాలి.
గేదెను కొనుటకు మునుపే నేతి బేరము చేయరాదు.
బాల్యం పువ్వులాంటిదైతే యౌవనం కాయలాంటిది. ఈ రెండు దశల్లో జాగ్రత్త వహించకుంటే ఫలరూపం నిష్పలమే.
మిమ్ములను ఇతరులు ఏప్రకారము చూడవలెనని మీరభిలషింతురో , ఆప్రకారము మీరు ఇతరులను చూడుడు. (దయగలిగి వర్తింపుడు)
అనురాగ రహితునకు గృహమే తపోవనము.
కష్టములు మానవునికి నీతి ధర్మములు బోధించును.
మన జీవితము ఇతరులకు ఆదర్శం కావాలి , సందేశం కావాలి.
ప్రపంచానికి మేలు చేసేవారి పద్దతి ఎప్పుడూ 'పని' ద్వారానే ఉంటుంది.
ఊహించడం , ఉపన్యాసాలు చెప్పటం వల్ల ఏమీకాదు. కేవలం బుద్దితో వాదోపవాదాలు చేయడం మానేయి. అవిసమస్యల్ని జటిలం చేస్తాయి. పరిష్కరించవు.
సూత్రాలు బోధించుటకు కాదు. పనిచేసి చూపించు ఇతరులను మంచి దారిలో నడిపించు.
పెద్ద ఇళ్ళు కట్టుకోవటం కాదు మనోభావాల్ని విశాలపరుచుకోవటం నేర్చుకో.
ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదు. కొన్ని పద్దతుల్ని పాటించు. ఖర్చు పెట్టటంకాదు. పొదుపు చేసుకో , దాన్ని సద్వినియోగం చేయి.
కనిపించింది కొనుట కాదు , కొన్న వస్తువులను మంచిగా ఉపయో గించడం నేర్చుకో.
విజ్ఞతతో ఏది ఎంత చేయాలో తొలుత నిర్ణయించుకొని జీవితాన్ని ప్రారంభించు , సాధించు.
విలువల్ని గురించి మాట్లాడటంకాదు. ఆచరించాలి. నీ ఆచరణే అందరికి ఆదర్శం.
*జీవితంలో రాశిని కాదు , 'వాసి' ని పెంచుకోండి.*
సన్మార్గములో నడిచేవారికి గౌరవము వెన్నంటును.
పరోపకారము వల్ల పుణ్యము - పీడనం వల్ల పాపం కలుగును.
నీ భవిష్యత్తును నీవే నిర్మించుకొనవలెను.
*ఇతరులు నీకు ఏంచేస్తే బాధ కలుగుతుందో , అది నీవు ఇతరులకు చేయకుండా ఉండడమే పరమ ధర్మం.*
వివాహానికి ముందు , పెళ్ళి చేసుకున్నాక , పిల్లలు పెద్దలయ్యాక , ముసలి తనంలో మనిషి ఎలా ఉండాలన్నదే ఆశ్రమ ధర్మం.
*నీవు నీకాళ్ళ మీద నిలబడ గల్గినపుడే ఇతరులకు 'సేవ' చేయగలవు. ఇంటి బాధ్యతలు వదిలి సమాజమంటూ పరుగిడితే నిన్ను నమ్మినవారు మునిగి పోతారు.*
నీ బాధ్యత యందు ఇంటిలో విఫలమైన నీవు బయటకూడా ఏమీ సాధించ లేవు. అంచేత కష్టపడి సంపాదించడం నేర్చుకో.
నీకు , నీ ఆశ్రితులకు రక్షణ కల్పించు. తరువాత ఇతరులకు బోధించు.
కష్టపడి పొందిన ఆదాయంలోని ఆనందం సోమరికి అర్థంకాదు. నా వల్ల అవుతుంది అని అనుకొన్నవారే విజయం సాధిస్తారు.
ఆపద వస్తుందేమో నన్న భయం ఆపదకన్నా భయానకము.
ఉన్నతిని పొందాలంటే గొప్పలకు పోరాదు.
మేకల ఐకమత్యం సింహాన్నైనా ఓడించును.
చిరు నవ్వు కఠినమైన పనిని గూడ లఘువు గావించును.