నారాయణ కవచ విశిష్టత - శ్లోకం భావన...!!

P Madhav Kumar


🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿


🌿సంస్కృత మహాభాగవతంలో  ఆరవ స్కందములో 8వ అధ్యాయం లో శ్రీ నారాయణ కవచం ప్రస్తావన ఉన్నది ...


🌸దాని యొక్క పూర్వాపరాలను , తాత్పర్యమును స్వామి దయతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


🌿దుష్ట శక్తులనుంచి మనల్ని రక్షించే మంత్రాన్ని కవచం అంటారు.. గణపతి, గాయత్రీ, సుదర్శన మొదలైన కవచ మంత్రాలలో నారాయణ కవచం ఒకటి.


🌸ఒకరోజు ఇంద్రుడు గర్వంతో సింహాసనంపై కూర్చొని గురువైన బృహస్పతి సభలోకి వచ్చినా గౌరవించలేదు. 


🌿గురువు కోపించి సభలో దేవతలను విడిచి వెళ్లిపోయాడు. అదే సమయంలో రాక్షసులు దేవతలపై దాడి చేసారు. 


🌸తట్టుకోలేని దేవతలు బ్రహ్మను శరణు వేడగా ‘గురువును పూజించనందువలన వారికి ఈ దుర్గతి వచ్చిందని త్వష్టమనువు కుమారుడైన విశ్వరూపుడిని ఆశ్రయిస్తే కష్టాలు తీరతాయని చెప్పారు. 


🌿దేవతలు విశ్వరూపుని ఆశ్రయించగా ఆ సమయంలో విశ్వరూపుడు వారికి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు.


నారాయణ కవచం గురించి పరీక్షిత్తు శుక మహర్షి ని ఇలా ప్రార్థించాడు....


🌹🙏రాజో వాచ: 🙏🌹


🌸1) యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్ రిపుసైనికాన్ |

క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్ ||


🌿2) భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్ |

యథాఽఽతతాయినః శత్రూన్ యేన గుప్తోఽజయన్మృధే||



🌸ఓ భగవాన్ ! శుక మహర్షీ ! నారాయణ కవచం అని ఒక వైష్ణవ విద్య ఉన్నదట కదా! ఆ నారాయణ కవచం సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపం. దాని చేత ఇంద్రుడు ఒక ఆట ఆడుకున్న పద్ధతిలో యుద్ధములు శత్రువులను జయించాడు. 


🌿మూడు లోకముల యొక్క సంపదను పొందాడు. అటువంటి గొప్పదైన నారాయణ కవచ విద్యను నాకు చెప్పవలసినది. 


🌸ఆ కవచం రక్షిస్తుండగా యుద్ధములో శత్రువులను ఆ ఇంద్రుడు జయించిన విధానమును కూడా చెప్పవలసినది...సశేషం...🚩🌞🙏🌹🎻


  🌹🙏జై శ్రీమన్నారాయణ..🙏🌹


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat