🙏కాళికా దేవి రూపం భయంకరమైనది🙏
ఆమె నివాసం మహాశ్మశానం* ఆమె అక్కడ_
శవం మీద నిలిచి_ ఆట్టహాసం చేస్తూ_ నాలుక
బయటకు_ చాచి పుర్రెల హారాన్ని ధరించి_
నాట్యమాడుతూ ఉంటుంది *
ఆమె నాలుగు హస్తాలలో
ఖండితమైన దైత్య శిరస్సునూ,
ఖడ్గాన్ని, వరదాభయ ముద్రలనూ కలిగి ఉంటుంది *
ఆమె దిగంబరి. ఏ ఆచ్చాదన లేని సనాతన క్రోధశక్తి.
కాళి శబ్దం నలుపును తెలియజేస్తుంది *
🙏భద్రకాళి...సర్వశుభంకరి
🙏కాళి మూర్తులలో దక్షిణకాళి🙏
భద్రకాళి అనే రెండు మూర్తులు ఉన్నాయి *
దక్షిణ అంటే అంతర్బోధ వల్ల కలిగే క్రియాశీలత *
భద్రశబ్దం అందరికీ మేలు కలిగించే అంశం.*
దక్షిణకాళి చేసే సంహార కృతం ప్రణాళికా రహితమైనది
కాదు.నిరర్థకమైందీ కాదు. అది నిర్దిష్టమైన
విశ్వపురోగమన శీలమైన కార్య నిర్వహణం *
భవిష్య సృష్టి పురోగామి లక్షణం కలది కావాలి.
భద్ర శబ్దం శుభదాయకమైంది.
సర్వులకు క్షేమం కలిగించేదీ అయివుంటుంది *
కాలం అనే పాకశాలలో వ్యక్తమైన జగత్తును
ఆమె వండి దాన్ని రుచికరమైన పదార్థంగా పరిణమింపజేస్తుంది. అందుకే ఆమె పాచక శక్తి అవుతుంది*
🙏యోగసాధకులకు మాత అనుగ్రహం🙏
"నాయమాత్మా బలహీనేన లభ్య"
అని వేదం అంటున్నది. బలం సాధించాలి.
బలం ద్వారా పరమాత్మను సాధించాలి.
మూలాన్ని ఎరుగటం కేవలం ధీరులకే సాధ్యం.
కాళీ ఉపాసన వీరసాధన. శ్మశానంలో శవం మీద
కూర్చుని, సామాన్యులకు భీతిని కలిగించే అస్థి
కపాలము మొదలైన వాటిని ఉపకరణాలుగా సాధన
చేసే విధానము ఉన్నది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు,
భాధలు భరించాల్సి ఉంటుంది. బ్రహ్మాండంలో
మహాశక్తిగా సాక్షాత్కారం పొందే శక్తి శరీరంలో
మూలాధారంలో కుండలనీ శక్తిగా నిద్రాదశలో
ఉంటుంది.ఈ సాధన దశలో ఆమె మేల్కొని
చుట్టుకుని ఉన్న తనను చేరరాని అనంత స్థుతులు,
అంతస్తులు సులభంగా సాధకులకు అందుతాయి.
ఏ యోగమార్గంలో సాగేవారికైనా కాళిమాత అనుగ్రహం తప్పనిసరి *
🙏కాళికలు🙏
మరికొన్ని సంప్రదాయాలలో
అష్టవిధ కాళికా మూర్తుల వర్ణనం ఉన్నది.
1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక
4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక
7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక. ఇంకా సిద్ధుల
ధ్యాన పరంపరను అనుసరించి ఈమె మూర్తి
అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది.
కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి.
22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది.
పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం,
షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము
ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం లో
మననం చూడవచ్చు.ఈ మంత్రాల సాధనలో
నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలులే
కాక కామ్య సాధనలు కూడా చెప్పబడ్డాయి.
🙏దశ మహా విద్యలలో మొదటిది కాళి🙏
సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక.
కాలాన్ని నడిపించేది, అత్యంత కఠినతరమైన ఆమె
ఉపాసనతో సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టి
అనంత శుభ ఫలాలు అందించడమే అమ్మ అనుగ్రహం...🙏
🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏
🙏💐🌸🌻🌺🌹🚩
*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏