లింగాష్టకం - భావ పూర్వకంగా

P Madhav Kumar


🌿🌼🙏మహామహిమాన్వితమైన శివ స్తోత్రం🙏🌼🌿మహాదేవుని స్తోత్రాలలో లింగాష్టకము చాలా ప్రత్యేకమైనది🙏🌼🌿శివుడ్ని మనం లింగ రూపంలో ఆరాధిస్తాం, కనుక లింగాష్టకం పఠించడం అత్యంత ఫలప్రదం🙏🌼🌿అయితే లింగాష్టకం అర్ధము కూడా తెలుసుకుని పఠిస్తే మంచిది🙏🌼🌿అర్ధం తెలుసుకుని పఠించడం వలన భక్తి, శ్రద్ధలు వృద్ధి చెందుతాయి, మనసు కూడా త్వరగా పూజలో లయం అవుతుంది🙏🌼🌿


🌿🌼🙏 లింగాష్టకం 🙏🌼🌿


బ్రహ్మ మురారి సురార్చిత లింగం 

నిర్మల భాషిత శోభిత లింగం

జన్మజ దుఃఖ వినాశక లింగం

తత్ ప్రణమామి సదా శివ లింగం  1 


🌿🌼🙏బ్రహ్మ , విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం.నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం. జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


దేవముని ప్రవరార్చిత లింగం 

కామదహన కరుణాకర లింగం 

రావణ దర్ప వినాశక లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  2 


🌿🌼🙏దేవమునులు , మహా ఋషులు పూజింప లింగం. మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం. రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


సర్వ సుగంధ సులేపిత లింగం 

బుద్ధి వివర్ధన కారణ లింగం 

సిద్ధ సురాసుర వందిత లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  3 


🌿🌼🙏అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం. మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం. సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ  శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం !🙏🌼🌿


కనక మహామణి భూషిత లింగం 

ఫణిపతి వేష్టిత శోభిత లింగం 

దక్ష సుయజ్ఞ వినాశక లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  4 


🌿🌼🙏బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం. నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం. దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం !🙏🌼🌿


కుంకుమ చందన లేపిత లింగం 

పంకజ హార సుశోభిత లింగం 

సంచిత పాప వినాశక లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  5 


🌿🌼🙏కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం. కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం. సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


దేవగణార్చిత సేవిత లింగం 

భావైర్ భక్తీ భిరేవచ లింగం 

దినకర కోటి ప్రభాకర లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  6 


🌿🌼🙏దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం. చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింపబడ్డ శివ లింగం. కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


అష్టదళో పరివేష్టిత లింగం 

సర్వ సముద్భవ కారణ లింగం 

అష్ట దరిద్ర వినాశక లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  7 


🌿🌼🙏 ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం. అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం. ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


సురగురు సురవర పూజిత లింగం 

సురవన పుష్ప సదార్చిత లింగం 

పరమపదం పరమాత్మక లింగం 

తత్ ప్రణమామి సదా శివ లింగం  8 


🌿🌼🙏దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం.దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం. ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము. ఓ సదా శివ లింగమా నీకు నమస్కారం ! 🙏🌼🌿


ఫలశ్రుతి : లింగాష్టక మిదం పుణ్యం 

యః పట్టేత్ శివ సన్నిధౌ 

శివ లోక మవాప్నోతి 

శివేన సహమోదతే  9  


🌿🌼🙏ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది. శివ లోకం లభిస్తుంది. శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat