హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"

P Madhav Kumar

 *హరివరాసనం*


అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం" గానం చేయడం ఒక సంప్రదాయం. 


శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు.


ఈ స్తోత్రాన్ని

"కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు.

1955 సంవత్సరంలో *స్వామి విమోచనానంద* ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో *వి. ఆర్. గోపాలమీనన్* అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. 

అప్పుడు ఆప్రాంతం నిర్మానుష్యంగా వుండేది.


మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు.

అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. 


తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. 

అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది.


శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని కూడా చెప్పుకోవద్దని చెబుతారు.


*ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.*


హరివరాసనం విశ్వమోహనం - హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం

అరివిమర్ధనం నిత్యనర్తనం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


శరణకీర్తనం శక్తమానసం - భరణలోలుపం* *నర్తనాలసం*

అరుణభాసురం భూతనాయకం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


ప్రణయసత్యకం ప్రాణనాయకం - ప్రణతకల్పకం సుప్రభాంచితం

ప్రణవమనీద్రం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


తురగవాహనం సుందరాననం - వరగధాయుధం వేదవర్ణితం

గురుకృపాకరం కీర్తనప్రియం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


త్రిభువనార్చితం దేవతాత్మకం - త్రినయనం ప్రభుం దివ్యదేశికం

త్రిదశపూజితం చింతితప్రదం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


భవభయాపహం భావుకావహం - భువనమోహనం భూతిభూషణం

ధవళవాహనం దివ్యవారణం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


కళమృదుస్మితం సుందరాననం - కలభకోమలం గాత్రమోహనం

కలభకేసరి వాజివాహనం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా


శ్రితజనప్రియం చింతితప్రదం - శృతివిభూషణం సాధుజీవనం

శృతిమనోహరం గీతలాలసం - హరిహరాత్మజం దేవమాశ్రయే


శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా

శరణం అయ్యప్పా - స్వామి శరణం అయ్యప్పా..🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat