హనుమంతుడు ఎక్కడ పుట్టాడో, పెరిగాడో తెలుసా...
హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం మన తిరుమల శేషాచల కొండలలో అంజనాద్రి పైన జపాలీ తీర్థం.
★జాపాలి ఆంజనేయస్వామి★
తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి.ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశం లో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి.
సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తప్పస్సు చేసిన పవిత్ర ప్రదేశం. కేవలం దర్శనమాత్రముచే పంచమహా పాతకములు, భూత,ప్రేత పిశాచాది బాధలు నుండి విముక్తులవుతారని స్కాందపురాణం లోని వేంకటాచలమహత్యంలో తెలుపబడినది.
🔘జాపాలి_తీర్థం :🔘
దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,బెట్లుడుతల ఉయ్యాలాటలతో,దివ్య సుగంధాలతో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.
ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట