1.ప్రాణాయ స్వాహా హృదయం ప్రాణము యొక్క స్థానం.శ్వాసని లోపలికి బయటికి పంపుతూ చక్కగా బ్రతికిస్తుంది. పొట్టలోకి అన్నం మొదలైన వాటిని ప్రవేశింప చేస్తుంది.
2.అపానాయ స్వాహా విసర్జన స్థానము.మనము తిన్నవాటిలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
3.వ్యానాయ స్వాహా దీని స్థానము శరీరము అంతటా విశేషంగా బ్రతికిస్తుంది.శరీరంలో చెమట పుట్టించి దానిద్వారా మలినాలు బయటకు వెళ్లేట్టు చేస్తుంది.
4.ఉదానాయ స్వాహా.కంఠం దీని స్థానం .మాటలు శబ్దాలు పుట్టించి బయటకు తీసుకుని వస్తుంది .
5.సమానాయ స్వాహా.దీని స్థానం నాభి (బొడ్డు). అన్నము ఆహార పదార్థాలను జీర్ణం చేసి దేహంలోకి నెత్తురును పొందేట్లు చేస్తుంది శరీరానికి శక్తి ఇస్తుంది.
అందుకనే మనం వండి తినే పదార్ధాలను ముందు గా దేవునికి నివేదించి (నైవేద్యం పెట్టి) దానిని మనము భోజనము తినేటప్పుడు ముందుగా 5 సార్లు పంచప్రాణాలకి 5 సార్లు ఆహారంగా కొద్దిగా నోటిలో వేసుకుని మన దేహంలో ఉన్న వైశ్వానరాగ్ని రూపంలో ఉన్న భగవంతునికి పంచ ఆహుతులు సమర్పించాలి. తరువాత మిగిలిన భోజనము చేయడము సంప్రదాయం.
ఇవి కాకుండా ఇంకో 5 పంచ ప్రాణాలు ఉన్నాయి .
1.నాగం.నోటిలో
2.కూర్మం.కన్ను తెరవడంలో
3.కృకరం.తుమ్మడంలో
4.దేవదత్తం.విజృంభణంలో
5.ధనంజయం.మృత శరీరాన్ని కూడా వదలకుండా శరీరమంతా ఉంటుంది
పంచ ప్రాణాలు
July 16, 2023
Tags