🌸శాక్తేయులు పూజించే శక్తి దేవతలలో ఒకరు లుతుంబరాదేవి.
మాతృకా నిఘంటువు అనే గ్రంధంలో యీ అమ్మవారిని గురించిన వివరాలు వున్నవి.
🌸ఈ లుతుంబరాదేవి అమ్మవారికి హిమాలయాలలో ఆలయం వున్నదని చరిత్రకారులు చెప్తున్నారు.
అక్షర శక్తులలో 9 వ అక్షరమైన లుకారం యొక్క అధిదేవతను లుతుంబరా దేవి అంటారు.
🌸ఈ దేవి యొక్క దేహం ఆకుపచ్చ వర్ణంలో వుంటుంది. పులి వాహనం మీద ఆశీనురాలై వుంటుంది.
పసుపరంగు పట్టు వస్త్రాలు ధరించి దర్శనమిచ్చే యీ దేవి అష్ట భుజములు కలిగి వున్నది. కుడి హస్తాలలో త్రిశూలం, పాశం,ఢమరుకం,
వరముద్రలతో, ఎడమ హస్తాలలో కత్తి, డాలు, కపాలం, దండం,
అభయముద్రలు కలిగి వున్నది.
🌸అమ్మవారి యీ రూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానించినవారికి సకల కళలు సిధ్ధిస్తాయి. ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని ధృఢంగా నమ్ముతారు. లుకారాక్షరం అమృతకేశ్వరం అనే శక్తి పీఠం నుండి ఆవిర్భవించిందని చెపుతారు.
ఇక్కడే సతీదేవి యొక్క కుడి చెంప పడినదని భావిస్తారు.
🌸దాక్షాయణీ కుడి చెంప రెండు మూడు ముక్కలు పెద్ద శబ్దంతో
వేగంగా హిమాలయచరీయలలో పడిందట. ఆ తాకిడికి
ఆ ప్రదేశాలలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. తరువాత కాలంలో యీ ప్రాంతమే దామోదర గుండమని పిలువబడుతున్నది.
శక్తిపీఠాలలో ఈ దామోదరగుండం ఒకటి.
🌸ఇక్కడ కొలువైన అమ్మవారు గండకేశ్వరి. గండకి, చండి అనే పేర్లతో పూజించబడుతున్నది.
నేపాల్ లో మస్తాంగ్ జిల్లాలో సుమారు
4,500 మీటర్ల ఎత్తున వున్న అతి విశాలమైన పీఠ భూమి ప్రాంతంలో దామోదరగుండం ఏర్పడినది.
🌸మస్తాంగ్ నగరం నుండి
రెండుమూడు రోజులు నడిచి ప్రయాణం చేసి భక్తులు
యీ శక్తి పీఠాన్ని దర్శిస్తారు.