రాములవారి అక్క

P Madhav Kumar


🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


*రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు.*


*కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి.*


*మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి ఘట్టాలు మూల రామాయణంలో లేవని చెబుతుంటారు. అలాంటి మరో గాథే రాములవారి అక్క గురించిన కథ!*


*దశరథునికి    రాములవారు జన్మించక ముందే ‘శాంత’ అనే కుమార్తె జన్మించిందట.* 


*కానీ ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి దత్తతుగా ఇచ్చాడట దశరథుడు.*


*రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా రోమపాదుని భార్య, కౌసల్యకి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకి తన కూతురిని దత్తత ఇచ్చారట.*


*శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్రవిద్యలలోనూ, వేదవేదాంగాలలోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం.*


*ఒకరోజు శాంత, రోమపాదునితో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా... ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదల్చుకున్నాననీ, ఆ వ్యవసాయానికి ఏదన్నా సాయం అందించమనీ ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు.*


*కానీ కూతురితో కలిసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనని ఆలకించనేలేదు.*


*తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి ఇంద్రుడు సహించలేకపోయాడు. అంగ రాజ్యం కరువుకాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు.*


*ఏళ్లు గడుస్తున్నా తగిన వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకి పాలుపోలేదు. అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలపెడితే, రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజగురువులు సలహా ఇస్తారు.*


*దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించినవారికి రుష్యశృంగుడనే మునికుమారుడు గుర్తుకువస్తాడు.*


*ఆ రుష్యశృంగుని ఆకర్షించి, అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంత బయల్దేరుతుంది.*


*అపురూప సౌందర్యరాశి అయిన శాంతని చూడగానే రుష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకుని వరుణ యాగాన్ని నిర్వహిస్తాడు.*


*అతని యాగానికి మెచ్చి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం, రోమపాదుడు శాంతను రుష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిగిపించడం వెనువెంటనే జరిగిపోతాయి.*


*ఒకరకంగా రాములవారు అవతారం దాల్చేందుకు కూడా శాంత యే కారణం. ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరుచుకున్న రుష్యశృంగుడే తర్వాతకాలంలో దశరథుని చేత పుత్రకామేష్టియాగాన్ని చేయిస్తాడు. ఆ యాగఫలంగానే రామ లక్ష్మణ భరత శతృఘ్నులు జన్మిస్తారు.* 


*శాంత గాథ పూర్తిగా కల్పితం కాదనేందుకు కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఉత్తరాదిన ‘రిషివంశి’ అనే క్షత్రియవంశంవారు తాము రుష్యశృంగ, శాంతల వారసులం అని ఇప్పటికీ నమ్ముతారు.*


*రుష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్నంలో ఒక గుడి కూడా ఉంది. దేవదత్త పట్నాయక్ వంటి ఆధ్మాత్మిక రచయితలు శాంతను మర్చిపోలేని, మరువగూడని పాత్రగా పేర్కొంటున్నారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*🙏

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat