సకల జీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు // సక //
మూఁడులోకము లొక్కట ముంచి పెరిగినది
పోఁడిమి నల్లనికాంతిఁ బొదలినది
పేఁడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాఁడే శేషగిరిమీఁద నాఁటుకొన్నమందు // సక //
పడిగెలువేయింటిపాము గాచుకున్నది
కడువేదశాస్త్రముల గబ్బువేసేది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది
కడలేనియంజనాద్రిగారుడపుమందు // సక //
బలుశంఖుఁజక్రములబదనికె లున్నది
తలఁచినవారికెల్లఁ దత్వమైనది
అలరినబ్రహ్మరుద్రాదులఁ బుట్టించినది
వెలుఁగుతోడుత శ్రీ వేంకటాద్రిమందు // సక //🙏