శ్రీ మత్స్యగిరీంద్రుడి ఆలయం - కరీంనగర్ జిల్లా : కొత్తగట్టు

P Madhav Kumar


👉శ్రీ మత్స్యగిరీంద్రుడి ఆలయం

💠 తెలుగునేలలో అడుగడుగునా  శ్రీ మహావిష్ణువు అవతార మూర్తులు కొలువుదీరాయి. 

అరుదైన మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన దేవాలయాలు దేశంలో మరెక్కడా లేని విధంగా తెలుగునాట పూజలందుకుంటున్నాయి. 


💠 విష్ణుమూర్తి అవతారాలన్నింటిలోకి ఎంతో

విశిష్టమైన దశావతారాలకు

సంబంధించిన ఆలయాలు ఎన్నో

ఉన్నప్పటికీ.. మత్సావతారానికి

సంబంధించిన ఆలయాలు చాలా

అరుదనే చెప్పాలి. 

అలాంటి అరుదైన మత్సేంద్రుడి ఆలయమే..

కరీంనగర్ జిల్లా కొత్తగట్ట గ్రామంలో వెలసిన మత్స్యగిరీంద్రుడి దేవాలయం.


💠 మత్స్యవతారానికి సంబంధించి

దేశం మొత్తంలో రెండే ఆలయాలు

ఉండడం.. అవి రెండూ మన

తెలుగు రాష్ట్రల్లోనే ఉండడం విశేషం.

ఒకటి కరీంనగర్ జిల్లా కొత్తగట్టు

మత్స్యగిరీంద్రుడు కాగా..

మరొకటి  చిత్తూరు జిల్లాలో నాగలపురం లో

ఉంది.


💠 కరీంనగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో వరంగల్ - కరీంనగర్  రహదారిలో కొత్తగట్టు గ్రామం వద్ద గుట్టపై వెలిశాడు శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి 


💠 క్రీ.శ. 13వ శతాబ్దం కారతీయుల కాలంలో దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతున్నది.


🔔 మత్స్యగిరీంద్రుడి చరిత్ర :


💠 ప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు లోకోపకారం కోసం మత్స్యరూపుడైనాడు. ఋషులు, సత్పురుషులు, వనమూలికలు, దివ్యౌషధులు, పశుపక్ష్యాదులతో కూడిన నావను తన కొమ్ముకు కట్టుకుని ప్రళయ జలధిని దాటించసాగాడు. 


💠 అలాగే శ్రీ మహా విష్ణువు లోక కళ్యాణర్ధమై సప్త సముద్రాలలో విహరిస్తున్న సమయంలో బ్రహ్మ దేవుడు కునుకు తీయడంతో వేదాలు సముద్రంలో జారిపడతాయి. 

దాంతో సోమకుడు అనే రాక్షసుడు వాటిని  అపహరించి సముద్ర అంతర్భాగంలో దాచి పెడతాడు. 

బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని వేడుకోవడంతో మహా విష్ణువు అవతారాలలో అత్యంత విశిష్ట అవతారమైన శ్రీ మత్స్యగిరీంద్రస్వామి అవతారమెత్తి సముద్ర అంతర్భాగంలోను వేదాలను పైకి తీసి, వాటిని రక్షించి తిరిగి బ్రహ్మదేవుడు కి ఇచ్చి లోకోపకారం చేశాడని ప్రతీతి. 


💠 అలాంటి అవతార పురుషుడు అంశ కొత్తగట్టు గ్రామంలో గుట్టపై మత్స్యగిరీంద్రునిగా వెలిశాడని ప్రతీతి.


💠 అలా ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల అభీష్టములను నెరవెర్చుతూ పూజలందుకుంటున్నట్లు పూర్వీకుల కథనం.

 


💠 గుట్టపై కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు హరించి, కోరిన కోరె నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


💠 అంతేగాక ఈ ప్రాంత వాసులు కోనేరులోని నీటిని తమ పొలాల్లో చల్లితే ఎలాంటి చీడపీడలు లేకుండా పంటలు బాగా పండి అధిక దిగుబడి వస్తుంది అనే నమ్మకం కూడా ఉంది. ఆలయ సమీపంలో  కోనేరు ఉంది. 

అందులో నీరు ఇప్పటివరకు ఎప్పుడూ  పూర్తిగా ఇంకిపోలేదని చారిత్రక సాక్షాధారాల వల్ల తెలుస్తోంది.


💠 ప్రతి ఏడాది మాఘ పౌర్ణమితో జాతర ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 

ఉత్సవాలలో భాగంగా శ్రీ మత్స్యగిరీంద్రుడికి భూ నీలాదేవిలతో కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం తర్వాత మరుసటి రోజు జాతర పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.


💠 ఆ పది రోజులూ కరీంనగర్‌ జిల్లా వాసులే కాకుండా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలవారు జాతరలో పాల్గొని మత్స్యగిరీంద్రుడిని దర్శించుకుని

స్వామివారి ఆశీసులు అందుకుంటారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat