🌿ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు.అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు. ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.
🌸మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మినబంటుగా ఉంటాడు.
🌿ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయుడుని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
🌸ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే.
🌿ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు.
🌸ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల విశ్వసిస్తుంటారు.
🌿అదే విధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు.
🌸నిజంగానే ఆంజనేయస్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా... మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
🌿రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు.
🌸ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ.. “హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాల”ని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు.
🌿ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీ రాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నాడు...🚩🌞🙏🌹🎻
. 🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿