సంతానం అనుగ్రహించే - సోమస్కంద మూర్తులు..!

P Madhav Kumar

🌿ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజించడం వల్ల కలిగే అనుగ్రహము గూర్చి ... ఒకసారి పూర్తిగా చదవండి..


🌸సంతానం కలగాలని కోరుకునే దంపతులు...!


🌿శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే,


🌸 పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన, సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం...


🌿 అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు.


🌸అందుకే తమిళనాట సోమస్కంద మూర్తి ఆరాధన విశేషంగా చేస్తుంటారు ...


🌿తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు.


🌸మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు.


🌿ఒక్కసారి ఈ సోమస్కంద మూర్తిని గమనించండి ...


🌸పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు ...


🌿సో- ఉమా- స్కంద మూర్తి


🌸సోముడు అనగా శివుడు ,

ఉమా దేవి అనగా పార్వతి దేవి,

స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు,


🌿 వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి ..

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat