🌿మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఇంటిలో ఉన్న పూజా మందిరంలో
ఉదయం సాయంత్రం దీపారాధన చేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాము.
🌸ఈ అనుమానం అనేకమందికి ఉంది. నివృత్తి చేసుకోండి
ప్రాచీనకాలం నుంచి కూడా ప్రతి ఇంట్లోను పూజా మందిరాలు ఉంటూ వస్తున్నాయి.
🌿అప్పట్లో వంట గదికి పక్కనే ఈ పూజా మందిరాలు ఏర్పాటు చేసుకుంటూ వుండేవారు. ఇక ఇటీవల కాలంలో పూజా మందిరానికి బదులుగా అందరూ పూజకి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
🌸ఈ విధంగా చేయడం వలన ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం లభిస్తుంది. దైవం పట్ల వెంటనే ఏకాగ్రత కలుగుతుంది.
🌿అయితే ఉదయం వేళలోను ... సాయంత్రం వేళలోను పూజ పూర్తి చేసిన తరువాత, వెంటనే పూజ గది తలుపులు వేయవచ్చా? ... వేయకూడదా? అనే సందేహం కొంతమందిలో తలెత్తుతుంటుంది.
🌸మరికొందరు దీపారాధన వుండగా తలుపులు వేయకూడదని అప్పటి వరకూ ఆ తలుపులను తెరిచే వుంచుతుంటారు.
🌿ఇంకొందరు దీపారాధనను కొండెక్కించేసి తలుపులు వేసేస్తుంటారు. ఈ విధంగా ఉద్దేశ పూర్వకంగా దీపారాధనను కొండెక్కించకూడదని శాస్త్రం చెబుతోంది.
🌸అలాగే దీపారాధన ఉన్నంత వరకూ తలుపులు తెరచి ఉంచవలసిన పనిలేదని. భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసిన కొంతసేపటి తరువాత పూజ గది తలుపులను వేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
🌿ఈ నియమాన్ని పాటించడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రం స్పష్టం చేస్తోంది...స్వస్తీ....🚩🌞🙏🌹🎻
🙏లోకా సమస్తా సుఖినోభవంతు.