#మారేడు....!

P Madhav Kumar

        *లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు.*


*సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.*


*మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకుంటారు.*


*మారేడు ఆయుర్వేదము నందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది. ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది. అందుకే ...*


*"త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం!*

*త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!!”*


*అని తలుస్తాము.*


*దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.*


*ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది.*

*అరుణాచలంలో బహు బిల్వదళం ఉంటుంది.*


*అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.*


*మామూలుగా అన్ని పుష్పములను...*

*పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు.*


*మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో  మారేడు దళము ఒకటి.*


*మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.*


*అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.*


*శివుడిని మారేడు దళంతో పూజ చేయగా నే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.*


*"బాల్యం,*

*యౌవనం,*

*కౌమారం*

*ఈ మూడింటిని నీవు చూస్తావు’  అని ఆశీర్వదిస్తాడుట.*


*కాబట్టి ..ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.*

*శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి మూడు గుణములకు అతీతుడు అవుతాడు.*


*మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.*


*ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి*

 *శ్రీసూక్తం  లో...*

 *"అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’*


*(అమ్మా అలక్ష్మిని= దరిద్రమును* *పోగొట్టెదవుగాక)*

*అని చెప్తాము.*


*మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి.* *నాల్గవదానిలోకి వెళ్ళడు.* 

*నాల్గవది తురీయము.*

*తురీయమే జ్ఞానావస్థ.*


*అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.*


*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది* 

*దేవతలకి ప్రదక్షిణం* *చేసినట్లే.*


*ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.*


*యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి,   పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.*


*శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది.*


*మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది.  అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.*


*‘మా-రేడు’*

*తెలుగులో రాజు ప్రకృతి,*

*రేడు వికృతి.*


*మారేడు అంటే మా రాజు.*

*ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.*


*అది పువ్వు పూయవలసిన అవసరం లేదు.*


*ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు  పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.*


*అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా..*

*మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే..*

*ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి*

*మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే..*

*మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.*


*అందులో..*

*1. మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం,*

*2. రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట,*

*3. మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.*


*ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.    


స్వస్తి..!

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat