*🪔ప్రతిరోజూ కలియుగ రాజు అయిన శ్రీ శనైశ్చరస్వామి అష్టోత్తర శతనామవళిని జపించడం వలన దారిద్ర్యం దూరమవుతుంది. సిరి సంపదలు కలుగుతాయి. పాపకర్మఫలితంగా భవిష్యత్తులో రాబోవు చెడు కర్మఫలితములు హరింపబడుతాయి. ఏలినాటి శని వంటి దశలలో ఉన్నవారిని కూడ శనిశ్చరుడు వారి యందు ప్రసన్నుడై వారిని అనుగ్రహిస్తాడు. ప్రతిరోజూ శ్రీ శనైశ్చరస్వామిని పూజించే ఇంటిని విష్ణుభగవాణుడి సుదర్శన చక్రం కాపాడుతూ ఉంటుంది. భూత, ప్రేత, పిశాచాది గణములు ఆ ఇంట ప్రవేశించలేవు. జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనివారు కూడా నిత్యం ” ఓం శం శనైశ్చరాయ నమః " అనే ఉత్కృష్టమైన మంత్రాన్ని జపించడం వలన చెడు గ్రహఫలితాలు శాంతిస్తాయి. వారి యందు కలిపురుషుడి ప్రభావం ఉండదు. వారి జోలికి యమధర్మరాజు వెళ్ళలేడని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి.*
*_శ్రీ శనైశ్చరస్వామి అష్టోత్తర శతనామావళి_*
ఓం శనైశ్చరాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయినే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం సర్వేశాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సురవంద్యాయ నమః
ఓం సురలోకవిహారిణే నమః
ఓం సుఖాసనోపవిష్టాయ నమః
ఓం సుందరాయ నమః
ఓం ఘనరూపాయ నమః
ఓం ఘనాభరణధారిణే నమః
ఓం ఘనసారవిలేపనాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం మందాయ నమః
ఓం మందచేష్టాయ నమః
ఓం వైరాగ్యదాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీతరోగభయాయ నమః
ఓం విపత్పరంపరేశాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం గృధ్రవాహాయ నమః
ఓం గూఢాయ నమః
ఓం కూర్మాంగాయ నమః
ఓం కురూపిణే నమః
ఓం కుత్సితాయ నమః
ఓం గుణాఢ్యాయ నమః
ఓం గోచరాయ నమః
ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః
ఓం ఆయుష్యకారణాయ నమః
ఓం ఆపదుద్ధర్త్రే నమః
ఓం విష్ణుభక్తాయ నమః
ఓం వశినే నమః
ఓం వివిధాగమవేదినే నమః
ఓం విధిస్తుత్యాయ నమః
ఓం మహానీయగుణాత్మనే నమః
ఓం మర్త్యపావనపాదాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం ఛాయాపుత్రాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం శరతూణీరధారిణే నమః
ఓం చరస్థిరస్వభావాయ నమః
ఓం చంచలాయ నమః
ఓం నీలవర్ణాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నీలాంజననిభాయ నమః
ఓం నీలాంబరవిభూషాయ నమః
ఓం నిశ్చలాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం విధిరూపాయ నమః
ఓం విరోధాధారభూమయే నమః
ఓం వేదాస్పదస్వభావాయ నమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వజ్రాంకుశధరాయ నమః
ఓం వరదాయ నమః
ఓం అభయహస్తాయ నమః
ఓం వామనాయ నమః
ఓం జ్యేష్ఠపత్నీ సమేతాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం అమితభూషిణే నమః
ఓం కష్టౌఘనాశకాయ నమః
ఓం ఆర్యపుష్టిదాయ నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తోత్రగమ్యాయ నమః
ఓం భక్తివశ్యాయ నమః
ఓం భానవే నమః
ఓం భానుపుత్రాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం పావనాయ నమః
ఓం ధనుర్మండల సంస్థాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనుష్మతే నమః
ఓం తనుప్రకాశ దేహాయ నమః
ఓం తామసాయ నమః
ఓం అశేషజన వంద్యాయ నమః
ఓం విశేషఫలదాయినే నమః
ఓం వశీకృతజనేశాయ నమః
ఓం పసూనాంపతయే నమః
ఓం ఖేచరాయ నమః
ఓం ఖగేశాయ నమః
ఓం ఘననీలాంబరాయ నమః
ఓం కాఠిన్యమానసాయ నమః
ఓం ఆర్యగణస్తుత్యాయ నమః
ఓం నీలచ్ఛత్రాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గుణాత్మనే నమః
ఓం నిరామయాయ నమః
ఓం నింద్యాయ నమః
ఓం వందనీయాయ నమః
ఓం ధీరాయ నమః
ఓం దివ్యదేహాయ నమః
ఓం దీనార్తి హరణాయ నమః
ఓం దైన్యనాశకరాయ నమః
ఓం ఆర్యజనగణ్యాయ నమః
ఓం క్రూరాయ నమః
ఓం క్రూర చేష్టాయ నమః
ఓం కామక్రోధకరాయ నమః
ఓం కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమః
ఓం పరిపోషితభక్తాయ నమః
ఓం పరభీతిహరాయ నమః
ఓం భక్తసంఘ మనోభీష్ట ఫలాదాయ నమః
|| ఇతి శ్రీ శని అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||