శ్రీ మూష్ణం వరాహస్వామి ప్రసాదం..!!
🌸ఇందులోని మూలమూర్తి స్వయంవ్యక్తంగా
వెలసిన ఆది వరాహమూర్తి.
ఈ క్షేత్రం సర్వరోగ నివారిణి క్షేత్రంగా ప్రసిధ్ధి పొందింది.
🌸ఆ ఆలయంలో ముస్తాపి చూర్ణం , తుంగ గడ్డి దుంప, చక్కెర, ఏలక్కాయి, ఇంకా పలు మూలికలతో తయారుచేసిన ఒక మహిమ గల పదార్ధాన్ని ప్రసాదంగా భక్తులకు పంచిపెడతారు. ఈ మహా ప్రసాదం అనేక రోగాలను నయంచేసే అద్భుత శక్తి కలది.
🌸శ్రీముష్ణం ఆలయంలో భూవరాహస్వామి ప్రధాన మూర్తిగా నిలబడిన భంగిమలో దర్శనమిస్తున్నాడు. తన నడుము వద్ద నున్న శంఖు, చక్రాలను , తను రెండు చేతులను మరుగు పరిచేవిధంగా, శరీరం పడమటి ముఖంగా, ముఖము దక్షిణ దిశగాను , భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
🌸శ్రీ మూష్ణం ఆలయంలో
సప్త మాతృకల సన్నిధి వున్నది. ఇక్కడ వీరు నారాయణునికి
సోదరీమణులుగాను,తాయారుకి చెలులుగాను వున్నారని ఐహీకం.
వివాహానికి అడ్డంకులు కలుగకుండా వుండడానికి, సంతాన భాగ్యం కోసం,
పీడలు తొలగడానికి, చేతబడుల బాధలు తీరడానికి, భక్తులు, సప్తమాతృకలను, వారాహి అమ్మవారిని, ప్రార్ధిస్తారు.
🌸ప్రాకారంలోనే తిరుపతి
శ్రీ నివాసుని చరణాలు దర్శనమిస్తాయి.
శీ మూష్ణం వచ్చినవారు
ప్రధమంగా యీ చరణాలనే దర్శనం చేసుకోవాలి. దర్శనమాత్రాన మన కష్టాలను తీర్చే దయగల తల్లి గా అంబుజవల్లి తాయారు దర్శనానుగ్రహం
కటాక్షిస్తున్నది.
🌸నైవేలి కి సమీపమున వున్న వళైయమాదేవి అనే స్ధలంలో కాత్యాయన మహర్షి కి
పుత్రికగా అవతరించింది యీ అమ్మవారు. శ్రీ భూవరాహస్వామిని పరిణయమాడిన పిదప
లోకమంతా ఆశ్చర్యపడే విధంగా, అత్యంత సౌందర్య రూపం ధరించి రావాలని యీ అమ్మవారు స్వామిని వేడుకొన్నది.
🌸ఆ విధంగా , బ్రహ్మదేవుడు చేసిన యాగ జ్వాల నుండి , పెద్ద శబ్దం చేస్తూ
యజ్ఞ వరాహస్వామిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు. ఈ స్వామియే శ్రీముష్ణం లో ఉత్సవ విగ్రహం. తన కోసమే కాకుండా భక్త కోటి కోసం, మహా విష్ణువు ని
వరాలు కోరే కరుణామయి అంబుజవల్లీ తాయారు.
🌸ముందుగా , అంబుజవల్లి తాయారుని దర్శించి, తర్వాత భూవరాహస్వామి దర్శనానికి వెడతారు. స్వామి గర్భగుడికెదురుగా
గరుడాళ్వార్ దర్శనం జరుగుతుంది.
గర్భగుడిలో స్వయంవ్యక్త మూర్తిగా, నడుమున చేతులు పెట్టుకొని, అసురుడైన హిరణ్యాక్షుని వధించిన విజయ గర్వంతో ,
🌸దర్శన మనుగ్రహిస్తున్నాడు భూవరాహస్వామి.
గర్భగుడి పడమటి ముఖంగా, స్వామి ముఖం దక్షిణ ముఖంగా
వుండడం అపూర్వ దర్శనం.
దక్షిణ దిశలో మోక్షం పొందిన హిరణ్యాక్షుడు , స్వామియొక్క కటాక్ష వీక్షణాలు సదా తనని అంటి పెట్టుకుని వుండాలని వేడుకోగా స్వామి అనుగ్రహించి యీ విధంగా దర్శన మిస్తున్నిడని ఐహీకం.
🌸ఈ స్వామిని పూజించినవారికి గొప్ప వాక్చాతుర్యం , సిరి సంపదలు, సంతాన భాగ్యం, ఉన్నత పదవులు, ఆరోగ్యవంతమైన
జీవితం, దీర్ఘాయువు లభిస్తాయి.
ఈ ఆలయ మూల విగ్రహానికి, పైన పావన విమానం అలంకరించబడి వున్నది.
🌸వరాహస్వామి
శ్రీ మూష్ణంలో విశ్రాంతి పొందిన సమయంలో , ఆయన శరీరం నుండి ధారగా కారిన చెమట,
నిత్య పుష్కరిణి అనే పునీత తీర్ధం గా మారిందట. హిరణ్యాక్షుని
సంహరించిన పిదప, వరాహస్వామి కనుల నుండి రాలిన ఒక ఆనంద బిందువు అశ్వధ్ధ వృక్షంగా
రూపం ధరించిందని చెపుతారు.
🌸ఈ ఆలయంలో గల చక్రతీర్ధం,
అగ్ని తీర్ధం, వేణు తీర్ధం,
మృత్యుంజయ తీర్ధం, కూడా ఎంతో ప్రత్యేకత కలిగియున్నాయి.
భగవంతుడు దివ్య వరాహ రూపంలో అనుగ్రహిస్తున్నందున, స్వామికి, తుంగ గడ్డి దుంప ని ప్రత్యేకంగా నివేదిస్తారు. దీని నుండి తయారు చేసిన ముస్తాపి చూర్ణం , సకల వ్యాధులను నయం చేస్తుంది.
🌸ఆ మహా ప్రసాదం తయారు చేయడానికి
కావలసిన పదార్ధాలు :
తుంగ గడ్డి దుంపలు -10
బియ్యప్పిండి- 1 కిలో
పాకం చక్కెర - 1 కిలో
ఏలక్కాయి - 15
నెయ్యి- 400 గ్రా
🌹తుంగ గడ్డి దుంపలను ఏలక్కాయలను బాగా పొడి చేస్తారు. దానిలొ
బియ్యప్పిండి కలిపి , ఆ మిశ్రమానికి చక్కెర పాకం , నెయ్యి కలిపి
ఉండలుగా చేస్తారు.
ప్రతీ రోజూ ఉదయం పది గంటలకే పూజ సంపూర్ణ మవగానే వరాహస్వామికి నివేదిస్తారు. ముస్తాపి చూర్ణం అని పిలువబడే
యీ మహా ప్రసాదాన్ని సకలరోగ నివారిణిగా భక్తులు కీర్తిస్తారు.