"
సామాన్యంగా మనకు భార్యా, పిల్లలు, బంధుమిత్రులు, మొదలైన వారు ఉన్న విషయం మనస్సులో మెదులుతూ ఉంటుంది గాని, భగవంతుడు ఉన్నాడు అన్న విషయం స్ఫురించదు.
భగవంతుడు ఉన్నాడు అన్న విషయంలో సరైన అవగాహన కోసం శ్రీ శృంగేరి పీఠాధిపతులుగా(1912--54)ఉన్న శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారికి, క్రైస్తవ మతానికి చెందిన ఒక విదేశీ మేధావికి, భగవంతుని ఉనికి గురించి జరిగిన చర్చను పరిశీలిద్దాం.
ఆదిత్యనారాయణ..
శ్రీ జగద్గురువులు: భగవంతుడు ఉన్నాడని ఏ వ్యక్తీ తనంత తానుగా గ్రహించలేడు. భగవంతుని చూచినవాడు చెప్పినప్పుడే ఆ విషయం అతనికి తెలుస్తుంది.ఆయనను గురువు అంటాము.
అయితే ఆయనకు ఎవరు చెప్పారు?
ఆయన గురువు.
ఆయనకు ఎవరు చెప్పారు?
ఇలా ఇది ఆనంతముగా సాగుతుంది.
కాబట్టి దేశ కాలములకు అతీతుడైన భగవంతుడే మొదటి గురువు.
( "స గురు:పూర్వేషామపి కాలే నానవచ్ఛేదాత్",అని యోగ సూత్రము).
ఆ విషయమును అవిష్కరించేదే " వేదము " .
ఆ వేదములు భగవంతుని నుండి వచ్చినవి. భగవంతునకు, భగవంతుని నుండి వచ్చిన వేదములకు భేదము లేదు.
అవి అనాది,అనగా ఆద్యంతములు లేక ఎల్లప్పుడూ ఉండేవి.
హిందూమతము అని పిలువబడుతున్న, మా
" సనాతన " మతము కూడా, వేదములే ఆధారముగా కలది గాన అనాది.
అది ఎవరి చేతను ప్రారంభింపబడ లేదు.
సనాతనము అంటే ఎప్పుడూ ఉండేది అని అర్థం.
మధ్యలో వచ్చిన వేరు వేరు మతములు, ఉదాహరణకు క్రైస్తవ మతము, ఆ మతబోధలు విన్న వారికే ముక్తి అని చెపుతున్నాయి.
అంటే ఆ మతబోధలు వినే అవకాశము లేని క్రీస్తుకు పూర్వము ఉన్న కోట్లాది మానవులకు, క్రీస్తుతో పుట్టినవారికీ, క్రీస్తుకు తరువాత పుట్టి, క్రీస్తును గురించి వినని వారికి, వారి తప్పిదమేమీ లేకున్ననూ, ముక్తి లేదన్నమాట.
ఇది అసమంజసము గదా!
సృష్టింపబడిన తొలి మానవునకు కూడా ముక్తి కావలయును.
భగవంతునినుండి ఆవిర్భవించిన "వేదములు" , సృష్టింపబడిన తొలి మానవుడికి కూడా ముక్తిమార్గమును గురించి, భగవంతుని గురించి తెలియజేశాయి.
విదేశీయుడు: భగవంతుని గురించి, ముక్తిని గురించి మనకు ఎవరూ చెప్పనక్కరలేదు.
భగవంతుడు ఉన్నాడని అందరికీ తెలియును. దానికి గురువు అవసరము లేదు.
ఆయనను తెలుసుకొనుట మాత్రము కష్టసాధ్యము కావచ్చును.
అందుకు భగవంతుని చూచినవారి మార్గదర్శకత్వము కావలసి వచ్చును.
భగవంతుడు ఉన్నట్లు
మన బుద్ధియొక్క శక్తివలన మనమే తెలుసుకొందుము.
శ్రీ జగద్గురువులు: భగవంతుడు ఉన్నాడన్న విషయం అంత తేలికగా తెలిసేది అయితే అందరికీ భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఉండాలి గదా!
మరి లోకంలో ఇంతమంది నిరీశ్వరవాదులు,అజ్ఞానులూ, ప్రబలుటకు కారణం ఏమిటి?
విదేశీయుడు : సమాధానము చెప్పలేకపోయాడు.
శ్రీ జగద్గురువులు: భగవంతుడు లేడను నాస్తికులు చాలామంది ఉన్నారుకదా.
నిజానికి వారందరూ అసామాన్య మేధావులు.
భగవంతుడు లేడని వారు ఎందుకు అంటున్నారు?
విదేశీయుడు: సమాధానము చెప్పలేదు.
శ్రీ జగద్గురువులు:భగవంతుడు లేడు అనువారు, వారి బుద్ధి బలంతో భగవంతుని అస్థిత్వమును నిరూపించుటకు ప్రయత్నించి విఫలులైనారు.
దానికి కారణము వారి బుద్ధి లోపము కాదు. నిజమైన కారణమేమనగా భగవంతుని ఉనికి, అస్థిత్వము,మానవ మేధస్సుతో నిష్కర్ష చేయుటకు వీలు కానట్టిది.
విదేశీయుడు: మౌనం వహించాడు.
శ్రీ జగద్గురువులు: బుద్ధిబలముతో భగవంతుడు ఉన్నాడని నీవు నిర్ధారణ చేయాలనుకున్నప్పటికీ, నిర్ధారణ చేయవలసిన భగవంతుని గురించి నీకు ఎవరు చెప్పిరి?
అనగా నీవు కొంత పూర్వ సమాచారముపై ఆధారపడక తప్పదు.
విదేశీయుడు: ఏమీ మాట్లాడలేదు.
శ్రీ జగద్గురువులు: భగవంతుడు ఉన్నాడని నీకు ఎవరైనా చెప్పినచో, ఆయన ఉన్నట్లు నీ బుద్ధిబలము ఉపయోగించి నిర్ధారణ చేసుకొనవచ్చును.
నీవు భగవంతుని గురించి పూర్వమెప్పుడును వినియుండనిచో, నీ బుద్ధిబలము దానిని జాగరితము చేయలేదు.
విదేశీయుడు: నా బుద్ధి బలము వినియోగించుటకు ముందు నేను భగవంతుని గురించి వినియుండనక్కర లేదు.
"భగవంతుడు" అనే పదము నా మనస్సులో లేకపోవచ్చును. కానీ, నిరంతరము మార్పుచెందుతున్న, అశాశ్వతమైన ఈ ప్రపంచము వెనుక శాశ్వతమైనటువంటి, మార్పులకు లోనుగానటువంటి, ఎదో ఒక శక్తి వున్నదన్న ప్రతీతి ( హేతువాదము)దానంతట అదియే తోచును.
శ్రీ జగద్గురువులు: నీవు భ్రమ పడుతున్నావు.
నిప్పును ఇంతకు ముందు చూడని వాడు, నిప్పును గురించి ఇంతకు ముందు వినని వాడు,పొగను చూచి అదే సత్యము అనుకొనును.
పొగ వెనుక నిప్పు ఉన్నది అని ఆ విషయం తెలిసిన వాడు చెప్పే పర్యంతము అతనికి పొగ మాత్రమే సత్యము.
ఆ పొగ వెనుక నిప్పు వున్నదని అతడు నిర్ధారించి చెప్పలేడు.
విదేశీయుడు: సమాధానం చెప్పలేదు.
శ్రీ జగద్గురువులు: అలాగే ప్రపంచము నిత్య పరిణామ శీలమైనప్పుడు,మార్పుచెందుతున్న ఆ ప్రపంచమే మనకు చరమ సత్యముగా గోచరించును.
దానివల్ల పరిణామము చెందని ఒక వస్తువు ఉన్నదన్న భావము రాదు.
విదేశీయుడు: మౌనంగా వున్నాడు.
శ్రీ జగద్గురువులు: అంతే కాదు. అన్ని వస్తువులు పరిణామశీలములే అనే భావన కూడా అతనికి వచ్చును.
విదేశీయుడు: ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
శ్రీ స్వామివారు: పరిణామము చెందని వస్తువు ఒకటి వున్నదని ఎవరైనా చెప్పినప్పుడు మాత్రమే,మనము నిత్యమూ చూస్తున్న,నిత్యమూ మార్పు చెందుతున్న
ఈ ప్రపంచమునకు,
మార్పు చెందని ఆ వస్తువునకు,
గల సంబంధము నిరూపించుటకు హేతువాదము ఉపకరించును.
నిర్దుష్టము, నిర్దేశితము అయిన వేదవాక్యము,లేక గురువాక్యము, లభించనప్పుడు, హేతువాదము, గాఢాంధకారమున గాలించుట మాత్రమే అగును.
విదేశీయుడు: మౌనంగా వున్నాడు.
శ్రీ స్వామివారు: మార్పులు లేని ఒక వస్తువు ఉండవచ్చు అని ఒక భావనకు హేతువాదము నిన్ను తీసుకొని పోవచ్చునేమో గాని, అట్టి వస్తువు(భగవంతుడు) ఒకటి నిశ్చయముగా వున్నదని గాని, దాని (భగవంతుని) స్వరూప స్వభావములు ఇట్టివని గాని,హేతువాదము ధృవపరుప లేదు.
విదేశీయుడు: (ఆనందముతో) స్వామీ! ఇట్టి అపూర్వ విధముగా ఆవిష్కారము (గురువు లేక వేదవాక్యము) యొక్క విలువ నాకు తెలియ జేసినందుకు, నేను మీకు మిక్కిలి ఋణపడి వున్నాను.
ఇంతవరకు ఇట్టి ఉదాత్త వివరణ నేను వినియుండలేదు".
ఆదిత్యాయోగీ..
ఈ సంభాషణవల్ల మనము, హేతువాదము యొక్క పరిమితి,భగవంతుడు వున్నాడు అని మనకు తెలియ జేస్తున్న వేదములయొక్క, ఆ వేదవాక్యములను మనకు ఉపదేశం చేస్తున్న గురువులయొక్క గొప్పదనము గ్రహించ గలుగుతాము.
ఆవిధంగా భగవంతుని మీద నమ్మకము ఏర్పరచుకోగలుగుతాము.
ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తెలియజేస్తున్నారు:
శ్లో// తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా/
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః//
(భగవంతుని తెలుసుకొనుట అనే బ్రహ్మజ్ఞానమును, ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠులను ఆశ్రయించి, వారికి సాష్టాంగ ప్రణామములాచరించి,భక్తితో వారిని సేవించి, పరిప్రశ్నేన, అనగా, తెలియని విషయములను ప్రార్ధనాపూర్వకంగా,తెలియజెప్పమని వారిని అడుగుతూ, తెలిసికొనుము. వారు నీకు ఆ బ్రహ్మజ్ఞానమును ఉపదేశింతురు).
.
జీవనం , జీవితం .., అలాగే జ్ఞానం , వినియోగం
' మనిషి - మనసు ' ఇవి దేనికి చెందినవి అని అనుకుంటే , మనిషికి చెందినవే అని అనుకోవాలి .
అలాగే మంచి -చెడు ; కష్టం -సుఖం లాంటి
ద్వంద్వ అనుభవ విషయంలో కూడా , ఈ ప్రశ్న ఉంటుంది . అప్పుడు కుడా ఇవి మనిషికి చెందినవే
అని అనుకోవాలి .
బాహ్యదృశ్యాన్ని చూసిన తరువాతే ఫీలింగ్ గ ,
ఆలోచనగా మనసు ఏర్పడుతుంది . ఆ తరువాత
మనసు మారిపోతుంది . ఇక్కడ గమనించవలసిన విషయం : చూసిన దృశ్యం అక్కడే ఉంటుంది ,
మనిషి జ్ఞానేంద్రియము అలానే ఉంటుంది . ఫీలింగ్
మార్పుతో దృశ్యం అదృశ్యమే . మరో జ్ఞానేంద్రియ సమాచారంతో , ఫీలింగ్ మనసు మారిపోతుంది .
బాహ్య సంబంధమైనది ఏదైనా జరుగుతున్నది . ఇదే .
ఏమైనా , బాహ్య జ్ఞానేంద్రియ సమాచారం తరువాతే , ఫీలింగ్ మనసు కలుగుతోంది కనుక ,
కారణ కార్య న్యాయాన్ని అనుసరించి , మనసు ఏర్పాటును , దాని ఫీలింగ్ ను , ఆలోచనను కార్యంగ
అనుకుంటే , అందుకు బాహ్యతే ప్రేరణగ కారణం అవుతుంది . ఈ క్రమంలో ఆలోచన వరకు పేరుకు మనసు అయినా , ప్రత్యక్ష కార్య నిర్వహణకు శరీరం
కారణమవుతోంది . ఆ తరువాతి క్రమంలో క్రియా ఫలిత స్వీకరణ , దాని అనుభవ ' కర్మఫలం ' శరీరానిదే . తద్వారా కలిగే తృప్తి - అసంతృప్తి
మాత్రమే మనసుదే . అలాగే శరీర భాధలు మొదటిగా కలిగేది శరీరానికే . దాని సమాచార ఫీలింగ్ మాత్రమే మనసు . శరీరానికి 'స్పర్శ ' తెలియని స్థితిలో , ఆ స్థితిని తెలియచేసే మనసుకు
ఉనికి లేదు . అంటే , బాహ్యతతో పాటు , జ్ఞానేంద్రియాలను కలిగిన శరీర స్థితే , ఫీలింగ్ మనసును కలిగిస్తుందనేది స్పష్టం . శరీర 'అవసర '
స్పర్శ ప్రేరణే మనసు భావన . ఆకార బాహ్యతకు సంబందించిన జ్ఞానేంద్రియ సమాచారానికి , బ్రెయిన్ ప్రతిస్పందనగ ఏర్పడే / కలిగే / అనిపించే ,
భౌతిక సంబంధ ఫీలింగ్ అఫ్ థాట్ కు సంబంధించి ,వివరణ ఇది అని అంటున్నారు
గురువుగారు .
ఆదిత్యాయోగీ..
శరీర అంతర్గత , నాడీ స్పర్శ , అవేర్ కాన్షస్ గ
భావించబడే అంతరాత్మ పరోక్ష ' మనసు ', ముఖ్యంగా , జీవిత నిర్వహణ సంబంధమైనది .
విషయ జ్ఞాన భావనకు ఆలోచనతో పాటు , యోచన, విచక్షణగ , జీవిత సమస్య పరిష్కార
జ్ఞానంతో పాటు అంతర్గత ( introspecive ) దివ్య జ్ఞాన , వికాసాన్నీ కూడా కలిగి ఉంటుంది .
భౌతిక జీవిత నిర్వహణ నియంత్రణ , మంచి - చెడు
ద్వంద్వ విచక్షణ క్రియా నిర్ణయం దీనిలోనివే అని అంటున్నారు గురువుగారు .....
.