మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి?

P Madhav Kumar


మాసశివరాత్రి


🍂మాస శివరాత్రి? ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలి? దీని వలన ఉపయోగములు ఏమిటి ? మాస శివరాత్రిని ఎప్పుడు జరుపుకోవాలి? ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. 


మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? 

మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 


🍂చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది.తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు.


🍂ప్రతిమాసంలో మాసశివరాత్రి రోజున శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం ఏకకాలంలో పొందడానికి ఆ రోజు పరమేశ్వరుడు కైలాసంలో ఆనందతాండవం చేస్తూ ఉంటాడు. అయితే, మాస శివరాత్రి రోజు ప్రదోషకాలలో ఆనందతాండవం, కైలాసంలో చేసే పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలతో శివార్చన చేయాలి. ఈ మాసంలో మాస శివరాత్రి రోజున శివార్చన చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రులు కావచ్చు. 


లక్ష్మీదేవి అనుగ్రహం పరమేశ్వరుడి అనుగ్రహం ఏకకాలంలో లభించాలంటే పరమేశ్వరుడికి సంబంధించి ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ మాసశివరాత్రి రోజున సాయంకాలం పూట ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి ఆ శక్తివంతమైన మంత్రం జపించాలి.


“శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఈశ్వరాయ నమః 

“ఇది మంత్రం ఆగమశాస్త్రం పరమేశ్వరుని ఐశ్వర్య ఈశ్వరుడుగా వర్ణించింది.


🍂ఈశ్వరుడు ఇవ్వాలి.. ఇల్లు నిండాలి అన్నట్లుగా పరమేశ్వరుడు ఐశ్వర్య ఈశ్వరుడు కాబట్టి.. ఈ ఐశ్వర్య ఈశ్వరుడికి సంబంధించిన మంత్ర జపం చేస్తూ శివాభిషేకం చేస్తే.. దానివల్ల ధనపరమైన సమస్యలని తొలగిపోతాయి. ప్రత్యేకంగా సాయంకాలం ఈరోజు అభిషేకం చేసేటప్పుడు ఆవుపాలతో అభిషేకం చేయటం కొబ్బరినీళ్ళతో అభిషేకం చేయటం, రుద్రాక్ష జలంతో అభిషేకం చేయటం, బిల్వ దళాలు కలిపిన జలంతో అభిషేకం చేయడం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే, ఈ రోజు సాయంకాలం పూట ప్రదోషకాలంలో ఈ మంత్రం చదువుతూ అభిషేకం చేసిన తర్వాత గంధం రాసిన మారేడు దళాలు పరమేశ్వరుడికి సమర్పించండి గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు కూడా ఈ ఐశ్వర్య ఈశ్వర మంత్రాన్ని చదువుకోవాలి.


🍂అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. గంధం రాసిన మారేడు దళాలు సమర్పించేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులని తొలగిపోతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. అనేక మార్గాలు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అలాగే, ఈరోజు శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. అలా వెలిగిస్తే దాంపత్య జీవితంలో ఏర్పడే విభేదాభిప్రాయాలని తొలగిపోతాయి. శివుడు పరమానంద భక్తుడై ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. 


మాసశివరాత్రి రోజున ఏ దేవున్ని ఆరాధిస్తే మంచిది? ఏయే ఫలితాలు?

🍂జాతకంలో కాలసర్ప దోషాలు ఉన్నవాళ్లు నాగదోషాలు ఉన్నవాళ్లు కుజ షాలు ఉన్నవాళ్లు పితృ దోషాలు ఉన్నవాళ్లు, ఈ దోషాలు ఏవి జాతకంలో ఉన్న ఆ దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రం బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్లు ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెన్నతో శివాభిషేకం చేసుకోండి. దాని వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, శత్రుభాధలు ఎక్కువగా ఉన్నవాళ్లు కనుదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేసుకోండి. ఇలా మీ సమస్యను బట్టి శివాభిషేకం చేసుకుంటూ ఈ ఐశ్వర్య ఈశ్వర శివ మంత్రాన్ని చదువుకుంటే శివానుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. 


మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు? 

🍂ప్రత్యేకించి ఈ రోజును శాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గు ముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కల్గుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్కంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమములో ఖశ్చితముగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందగలుగుతాము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat