👉 శ్రీ అక్కన్నమాదన్న మహాకాళి ఆలయం.
💠 అక్కన్న మాదన్న మహాకాళి గుడి భారతదేశములోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదునందు గల పురాతన దేవాలయం.
💠 ఈ దేవాలయం జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదులలో జరిపే ప్రసిద్ధ పందగ బోనాలుకు ప్రసిద్ధి చెందినది.
ఈ దేవాలయం బోనాలు పండగలలో ఘటాల ఊరేగింపుకు కూడా ప్రసిద్ధి చెందినది.
💠 అక్కన్న, మాదన్న లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో కుతుబ్ షాహీ వంశానికి చెందిన తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు.
💠 17 వ శతాబ్దంలో హైదరాబాదు తానీషా పరిపాలనలో ఉండేది.
ఆయన గోల్కొండ కోటకు చక్రవర్తిగా ఉండేవారు.
ఆయన రాజ్యంలో అనేక మంది మంత్రులు ఉండేవారు.
వారిలో ముఖ్యులు అక్కన్న, మాదన్నలు.
వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు.
💠 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు.
వీరి మేనల్లుడైన కంచర్ల గోపన్న రామదాసుగా పేరుగాంచిన తెలుగు వాగ్గేయకారుడు.
💠 ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది.
వీరి మరణం తర్వాత ఔరంగజేబు తానీషా చక్రవర్తిని ఓడించి గోల్కొండ కోటను ఆక్రమించాడు.
దీనితో గోల్కొండ రాజ్యంలో కుతుబ్ షాహీల పాలన అంతం అయింది
💠 అక్కన, మాదన్నలు ఈ దేవాలయం ప్రాంతంలో నివసించేవారు.
వీరు మహాకాళీ యొక్క భక్తులు.
వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు.
వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి (గోల్కొండ) కు హాజరయ్యేవారు. వారు హతులైన తర్వాత ఈ దేవాలయం మూయబడింది.
💠 67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం షాలిబండ వద్ద పునః ప్రారంభించబడింది.
ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.
💠 ఈ ఆలయం హిందూ సంప్రదాయాలు మరియు నిర్మాణ శైలి ప్రకారం నిర్మించబడింది. ఆలయం యొక్క స్తంభాలు, గోడలు మరియు పైకప్పుపై దేవత మరియు దేవతల చెక్కడం మరియు శాసనం మరియు వాటికి సంబంధించిన కథలు ఉన్నాయి.
ఆలయ ఆవరణలో అనేక చిన్న దేవాలయాలు ఉన్నాయి మరియు ప్రధాన గోపురం పెద్ద మరియు చిన్న దేవతల చిత్రాలను కలిగి ఉంది
💠 అక్కన్న మాదన్న ఆలయం మహంకాళి భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది .
ఈ ఆలయంలో, హిందూ సంప్రదాయాలు మరియు ఆచారాల ప్రకారం చాలా పూజలు, అర్చనలు చాలా పరిపూర్ణంగా జరుగుతాయి . వేదాలలో సూచించబడిన చాలా నియమాలు మరియు నిబంధనలు ఈ మహాకాళి ఆలయంలో అనుసరించబడతాయి . మహంకాళి భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి మరియు మహాకాళి ఆశీర్వాదం పొందడానికి ప్రతిరోజూ ఈ ఆలయాన్ని సందర్శిస్తారు
💠 శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం 1961 సం " లో కీ"శే" నవ్వాడ ముత్తయ్య ముదిరాజ్ గారు నిర్మించినారు ...ఈ దేవాలయం ప్రత్యేకత హైదరాబాద్ పాత బస్తి లో గల లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారికీ బోనాలు సమర్పించే ఒక వారము ముందు ఘటలు కార్యక్రమం ఉంటుంది.
దీనిలో మొత్తం ఘటలు 21ఉంటే మరొక విశేషం ఎంటంటే వీటిలో 14 ఘటలు ముదిరాజ్ వంశానికి చెందినవి ఉంటాయి