కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి? - Kaakulaku Aaharam, Why to feed crows?

P Madhav Kumar

 కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి? - Kaakulaku Aaharam, Why to feed crows?

కాకులకు ఆహారం ఎందుకు పెట్టాలి - అసలు కాకులకు ధర్మానికి ,సైన్స్ కి ఉన్న సబందం ఏమిటి?

కాకులకు పాశం(తీపి)పెట్టాలని చెప్తారు!!! కాకులకు పెడితే మన పెద్దలకు ముడుతుంది అని!!!ఒక్క విషయం ఆలోచించండి, మన ఋషులు బాగా తేజస్సు తో, చెప్తారు. ఇదిగో ఆధారం ఇస్తున్నాను. పితృ పక్షాలలో మన పెద్దల ప్రతినిధి గా భావించి కాకులకు భోజనం పెడతాం. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది కేవలం కాకులకే ఎందుకు భోజనం పెడతాం? అని .దానికి జవాబు , ఆధారం ఇస్తున్న.మన పురాణాలలో చెప్పిన దాని ప్రకారం, గరుడ పురాణం ప్రకారం కాకులు యమధర్మరాజు కు సందేశం ఇచ్చే వాహకాలుగా పనిచేస్తాయి, శ్రాద్ధ పక్షం లో ఇంటింటికి తిరిగే కాకులు అక్కడ తినడం వలన యమలోకం లో ఉండే పితృదేవతలకు తృప్తి కలుగుతుంది.

వైజ్ఞానిక (సైన్స్) కారణం:
దీనికి ఉన్న వైజ్ఞానిక (సైన్స్) కారణం ఏంటి? ఆంటే, కాకులు రావి, మరియు వేపల గింజలు తింటాయి, తరువాత ఆ గింజలు వాటి కడుపులోనే చర్య (processing) జరిగి ఇది ఎక్కడెక్కడ విసర్జిస్తుందో అక్కడక్కడ ఈ మహావృక్షాలు మోలుస్తాయి. మీకో ముఖ్యమైన విషయం తెలుసా వేప చెట్టు ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఆక్సీజన్ వదిలే ఏకైక చెట్టు, ఇక రావి చెట్టు ఔషధ గుణాలు అద్భుతం గా ఉంటాయి. ఈ రెండు చెట్లు మానవుల ఒక్కరివలన పెరగడం సాధ్యం అయ్యే పని కాదు ఇందులో కాకులు చేసే పని అద్భుతం. అందుకే కాకులను మనం రక్షించాలి.

మరొక విషయం ఏంటంటే ఆడ కాకులు 12 వ నెలలో గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి.ఆ చిన్న పిల్లలకు ఆహారం అందాల్సి ఉంటుంది అందుకే మన ఋషులు ఈ పిల్లల కోసం ఇంటి పై కప్పు పైన పెద్దలకు ఒక ముద్ద అన్నట్టు శ్రాద్ధ భోజనం అనేది చెప్పడం జరిగింది.

అప్పటి నుండి కాకుల కొత్తతరం మొదలవుతుంది.
అందుకే రోజుకో ముద్ద ఇంటి, గోడ ల పైన పెట్టాలని చెప్తారు, ఇది ప్రకృతి రక్షించడానికి మన వంతు బాధ్యత కూడా.మనకు రావి,వేప చెట్లు చూడగానే గుర్తొస్తారు మన పెద్దలు శ్రాధాలు పెట్టడం వలననే ఇలా ఉన్నాయి అని.

సనాతన ధర్మం మీద వేలెత్తి. చూపించే వాల్లుంటారు వాళ్లకు ఒక్కటే చెప్తున్న ముందు సనాతన ధర్మం గురించి తెలుసుకో ఆ తరువాత వేలెత్తి చూపు.మీకు చదవడం రానప్పుడే మా ధర్మానికి తెలుసు ఏ జబ్బు కు ఏ మందు అనేది!!!. సనాతన ధర్మానికి మీ కంటే ముందే మీకు బట్ట కట్టడం రానప్పుడే తెలుసు ఏది తినదగినది ఏది తినకూడనిది అని,

మన వేదాలలో చాలా విషయాలు,మందుల రహస్యాలు ఉన్నాయి. విదేశీయుల మోజులో పడి మన ఋషులను వేలెత్తి చూపించే బదులు వాళ్ళ జ్ఞాన్నాన్ని అర్థం. చేసుకొనే ప్రయత్నం చేస్తే అర్థం అవుతుంది వాళ్ళు ఎంత జ్ఞానాన్ని ఆర్జించారు అనేది

అప్పుడు తెలుస్తుంది.మన ఋషులు ఎంత తెలివి తో జ్ఞానాన్ని ఆర్జించారో అది వర్ణించడం కూడా కష్టమేనేమో.

రచన: రేణుక పరశురామ్

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat