లలిత సహస్రనామం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః
1. || ఓం శ్రీమాత శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత ||
- శ్రీమాత : శ్రీదేవి అను ప్రసిద్ధనామముగల జగన్మాత , సమస్త సృష్టికి మూలమైనది.
- శ్రీ మహారాజ్ఞీ : మహారాణి, సమస్త లోకములను పరిపాలించుచున్నది.
- శ్రీమత్ -సింహసనేశ్వరి : సింహాసనమును అధిష్టించి దుష్ట శిక్షణ చేయునది.
- పై మూడు నామముల వలన లలిత దేవి సృష్టి , స్థితి, లయ కారిణి అని తెలియుచున్నది. చిదగ్ని కుండసంభూత : జ్గ్యానము అను అగ్ని కుండమున పుట్టినది.
- దేవకార్య సముద్యతా : దేవతల పని చేయుటకు పూనుకొన్నది. ( దేవతల పని అనగా ఆధ్యాత్మిక సాధన)
2. || ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల ||
- ఉద్యద్భాను సహస్రాభ : ఉదయించిన వేయి సూర్యుల వెలుగు కలిగినది.
- చతుర్బాహు సమన్విత : నాలుగు బాహువులు కలిగినది.
- రాగాస్వరుప పాశాడ్యా : అనురాగమే పాశముగా కలిగినది.
- క్రోధాకారంకుశోజ్జ్వలా : క్రోదమును అంకుశంగా కలిగినది.
3. || మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మండమండల |||
- మనోరూపేక్షు కోదండ : మనసే విల్లుగా కలది
- పంచతన్మాత్ర సాయక : ముఖ, చంద్ర , అష్టమి , రస, గంధములు అను పంచ తన్మాత్రములను బానములుగా కలది.
- చంద్ర ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన ఎర్రన్ని కాంతి చే బ్రహ్మాండమంతయు నింపి వేసినది.
4. || చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత ||
- చంపకాశోక పున్నాగ : సంపెంగ, అశోక, పున్నాగమొదలగు పుష్పములు
- సౌగంధిక : సువాసనగల
- లసత్కచ : తలకట్టు
- కురవింద మణి : కురవింద అను పేరు గల ఎర్రని మణులు
- శ్రేణి : వరుస
- కనత్ కోటీర మండితా : ప్రకాశం తో కూడిన కిరీటముధరించినది
5. || అష్టమిచంద్ర విభ్రాజ దళికస్తల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక ||
- అష్టమీ చంద్ర : అష్టమి నాటి చంద్రుడు
- విభ్రాజ : ప్రకాశించు
- దళికస్థల : నుదిటి భాగం
- శోబిత : ప్రకాశం కలిగినది
- ముఖ చంద్ర : చంద్రుని ముఖమునందు
- కళంకాభ : మచ్చ
- మృగనాభి విశేషక : కస్తూరి తిలకం దిద్దిన అందమైనముఖము
6. || వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన ||
- వదనస్మర మాంగల్య : అందమైన కనుబొమ్మల తో కూడినముఖము
- గృహ తోరణ : గృహమునకు అలంకరించిన మంగళతోరణము వలె
- చిల్లికా : అందమైన ముఖము కలది
- వక్త్ర లక్ష్మీ పరీవాహ : ముఖ సౌందర్యం అనే ప్రవాహమున
- చలన్మీనాభలోచన : చేపల వంటి అందమైన కనులు కలది
7. || నవచంపక పుష్పాభ నాసదండ విరాజిత తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ||
- నవచంపక పుష్పాభ : క్రొత్త సంపెంగ మొగ్గలు
- నాసదండ విరాజితా : అందమైన నాసిక కలది
- తారా కాంతి : నక్షత్రాల వెలుగు
- తిరస్కారి : మించిన
- నాసాభరణ : ముక్కెర (నాసిక ఆభరణం)
- భాసుర : ఆభరణం కలిగినది
8. || కదంబ మంజరీ క్లుప్త కర్ణపూరమనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల ||
- కదంబ మంజరీ క్లుప్త : కడిమిపూల గుత్తి చే అలకరించిన
- కర్ణపూర మనోహర : అందమైన చెవులు కలది
- తాటంక యుగళీభూత తపనోడుప మండల : సూర్యచంద్రులను చెవికమ్మలుగా కలిగినది
9. || పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద ||
- పద్మరాగశిలాదర్శ : పద్మరాగమణి (కెంపు) తో చేయబడినఅద్దములు
- పరిభావి కపోలభూ : కెంపుల ప్రకాశం కంటే ఎక్కువప్రకాశం గల చెక్కిళ్ళు కలది
- నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా : క్రొత్త పగడమును మించిన అందమైన యెర్రని పెదవులు కలది.
10. || శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర ||
- శుద్ధవిద్యాంకురాకార : శ్రీవిద్య అనబడు షోడశీమంత్రములోని పదునారు బీజాక్షరాలు
- ద్విజపంక్తి ద్వయోజ్వల : తెల్లని ప్రకాశవంతమైనపలువరుస కలది
- కర్పూరవీటికామోద : కర్పూర తాంబూల సువాసనలు
- సమాకర్షదిగంతరా : నలుదిక్కులను ఆకర్షించునది.
11. || నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపి మందస్మిత ప్రభాపుర మజ్జత్కామేశ మానస ||
- నిజసల్లాప మాధుర్య : తన పలుకుల మాధుర్యము చేత
- వినిర్భర్త్సిత కచ్ఛపీ : సరస్వతీదేవి వీణా నాదమునుజయించునది
- మందస్మిత : చిరునవ్వులు
- ప్రభాపూర : కాంతి
- మజ్జత్ : వశము చేసుకొను
- కామేశ : కామేశ్వరుడు
- మానసా : మనసును జయించునది.
12. || అనాకలిత సాదృశ్య చుబుకశ్రి విరాజిత కామేశ బద్ధమాంగాల్య సూత్ర శోభిత కంధర ||
- అనాకలిత సాదృశ్య : పోల్చుటకు సాద్యముకాని
- చుబుక శ్రీ విరాజితా : అందమైన గడ్డము (చుబుకము)కలది
- కామేశ బద్ధ : కామేశ్వరుని చే
- మాంగల్య సూత్ర : మంగళ సూత్రము
- శోభిత : శోభిల్లుచున్న
- కంధరా : కంట్టము కలది
13. || కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ||
- కనకాంగద కేయూర : బంగారు బుజ కీర్తులతోను(వంకీలతో) కమనీయ : చూడచక్కని
- భుజాన్వితా : భుజములు కలది
- రత్న గ్రైవేయ : రత్నములు పొదిగిన
- చింతాక : చింతాకు పతకము
- లోల ముక్తా ఫలాన్వితా : ముత్యాల జాలర్లు